YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

పండించిన ప్రతి గింజను కొంటాం -  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పండించిన ప్రతి గింజను కొంటాం -  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పండించిన ప్రతి గింజను కొంటాం
-  మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి నవంబర్ 16
రైతులు పండించిన ప్రతి గింజను వారి కలాల దగ్గరే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం వనపర్తి జిల్లా రేవల్లి మండలం లోని చెన్నారం, గొల్లపల్లి, రేవెల్లి, నాగపూర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ సీఎం చెక్కులను, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చెన్నారం గ్రామానికి చేరుకున్న మంత్రికి పార్టీ కార్యకర్తలు, గ్రామ నాయకులు స్వాగతం పలికినంతరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి  కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ఆయన అన్నారు. ముఖ్యంగా మధ్య దళారులు తెచ్చే వడ్ల కు తావుండదని, రబీ నాటికి పల్లి కి కూడా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేందుకు ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా రైతులు ఒకే పంట కాకుండా పంట మార్పిడి చేస్తే ఎక్కువ పంట పండటానికి ఆస్కారం ఉంటుందని ఆయన అన్నారు. మండలంలో పెండింగ్లో ఉన్న కాల్వలను త్వరలో పూర్తి చేస్తామని, గ్రామంలో నాలుగు సంవత్సరాలలో ప్రతి బజార్ సిసి రోడ్లను, ప్రతి స్తంభానికి లైట్లు ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం గొల్లపల్లి, రేవల్లి, నాగపూర్ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రేవల్లి లో ముద్ర బ్యాంకు ను ప్రారంభించి గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, డిఆర్డిఓ గణేష్, జెడ్ పి టి సి బోర్ల భీమయ్య, ఎంపీపీ బంకుల సేనాపతి, ఎంపీడీవో, తహసిల్దార్, సర్పంచ్ ,ఎంపీటీసీ, మాజీ ఎంపిటిసి మాజీ ఎంపీపీ జానకి రామ్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు, గ్రామం మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts