YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి

ఇసుక రీచ్ ను ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
నెల్లూరు నవంబర్ 16
రాష్ట్రంలో మరో వారం రోజుల్లో రోజుకి రెండు లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కలవకూరులో ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడుతూ గత తెదేపా అక్రమార్కులకు కొమ్ము కాసిందని, ఓ తహసీల్దారును తన ఛాంబర్‌కు పిలిచి బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇసుక గురించి మాట్లాడే హక్కు ఆయనకు, ఆ పార్టీ నాయకులకు లేదన్నారు. ఎవరైనా వ్యక్తి చనిపోతే వారిని భవన నిర్మాణ కార్మికులుగా చెబుతున్నారన్నారు. ఇదంతా తెదేపా, జనసేన ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. ముఖ్యమంత్రి జగన్‌ అన్ని వర్గాల కోసం పాటు పడుతున్నారని, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే వారిని ఆదుకుంటామన్నారు. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లు వివరించారు. ఇసుక అక్రమాలు నివారించడానికి కఠిన శిక్షలు అమలు చేసేలా చట్టం తీసుకురావడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. అక్రమ రవాణా నివారణకు 200 చెక్‌పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వరదలు వచ్చే సమయంలో ఇబ్బంది ఉంటుందని, దాన్ని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. డీజీ స్థాయి అధికారితో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామన్నారు. వరదల ముందు కోటి టన్నుల ఇసుక నిల్వలు ఉంటే, తర్వాత 10 కోట్ల టన్నుల మేర అందుబాటులోకి వచ్చాయన్నారు.

Related Posts