ఎమ్మెల్యేను అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు
నాగర్ కర్నూలు నవంబర్ 16,
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ఈ సమావేశాన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికుల 43వ రోజు ఉదయం డిపో దగ్గర ధర్నా నిర్వహించారు. కల్వకుర్తి మండల సర్వసభ్య సమావేశంలో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఉన్నారని తెలుసుకుని న సమావేశ మందిరంలోకి కార్మికులు ఒక్కసారిగా చోచ్చుకొనిపోయారు, కొంతమంది మహిళా కండక్టర్లు సమావేశ మందిరంలోకి నేలపై కూర్చొని తమ నిరసనను వ్యక్తం చేశారు,పోలీసులు లకు కార్మికులకు తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది, కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎమ్మెల్యే వేదికపై నుంచి రావాలని అనడంతో వేదికపై ఉన్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కార్మికుల దగ్గరికి వచ్చి ఆర్టిసి సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కార్మికులు, ఎవరు ఆత్మబలిదానాలు చేసుకోవద్దని సూచించారు. కార్మికులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత వారి కుటుంబాలకు కనీసం పరామార్శించని విడ్డూరంగా ఉందని అన్నారు,మొన్న జరిగిన ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ ఆందోళన కార్యక్రమంలో డిపోకు చెందినమహిళ కండక్టర్ శేషమ్మ కు తీవ్ర గాయాలు కావడంతో కనీసం ఎమ్మెల్యే అయి ఉండి మీరు పరామర్శించకపోవడం ఎంతవరకు సబబు అని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ని నిలదీశారు.