LIC పాలసీల పునరుద్ధరణకు మరింత గడువు
రద్దయిన భీమా పాలసీలను పునరుద్ధరించుకునేందుకు కల్పించిన ప్రత్యేక సదుపాయానికి పాలసీదారుల నుండి అపూర్వ స్పందన లభించినట్లు LIC తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సదుపాయాన్ని నవంబర్ ౩౦ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. దీని వల్ల మరింత ఎక్కువ మంది కష్టమర్లు రద్దయిన తమ పాలసీలను పునరిద్ధరించుకోవచ్చని తెలిపింది. 2013 డిసెంబర్ 31 తర్వాత పాలసీ కొనుగోలు చేసి ఒకవేళ రద్దయితే దాన్ని ఇప్పుడు పునరిద్ధరించుకోవచ్చని చెప్పింది. ఇంతకు ముందు ఈ సదుపాయం పాలసీ ప్రీమియం చెల్లించినప్పటి నుంచి రెండేళ్ళ వరకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఈ కాలపరిమితి నాన్ లింక్డ్ పాలసీలకు ఐదేళ్లు, లింక్డ్ పాలసీలకు మూడేళ్ళ వరకు ఉంది.