YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కమలానికి కళ్లెం వేసేదెలా...

కమలానికి కళ్లెం వేసేదెలా...

కమలానికి కళ్లెం వేసేదెలా...
విజయవాడ, నవంబర్ 18
ఆంధ్రప్రదేశ్ లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా రేపటి రోజు మాదేనని కమలనాధులు గట్టిగా గర్జిస్తున్నారు. కేందంలోని ఆధికార బలంతో ఏపీలోని ఇతర పార్టీలని ఎలిమినేట్ చేయగలమన్న ధీమావే దీనికి కారణం. అయితే ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు ఎందుకు వచ్చాయి. మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ పక్కన బీజేపీని ఎందుకు కూర్చోబెట్టారు. 2014 ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపీ సీట్లూ ఇచ్చిన ప్రజలు ఇపుడు కనీసంఎక్కడా కూడా డిపాజిట్లు కూడా ఎందుకు ఇవ్వలేదు, దీనికి సమాధానం చాలా సింపుల్. ఏపీకి బీజేపీ చేసిందేమీ లేదని జనం భావించారు కాబట్టి. ముఖ్యంగా ప్రత్యేక హోదాను తుంగలోకి తొక్కారు అన్న ఆక్రోశం జనంలో బలంగా ఉంది కాబట్టి అని కూడా చెప్పుకోవాలి. ఇక మరో వైపు విభజన హామీలు నెరవేర్చక పోవడం, ఆర్ధికంగా ఆదుకోవడానికి ముందుకు రాకపోవడం, ఇవన్నీ కూడా ఏపీ జనాలకు బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను కలుగచేశాయి. మరి అవన్నీ ఈ ఆరు నెలల్లో బీజేపీ చేసిందా… వేల కోట్ల నిధులు ఏపీకి కుమ్మరించిందా? మరి ఏం చేసిందని బీజేపీ ఏపీలో బలంగా తయారవుతోందని కాషాయం పార్టీ నేతలు చెబుతున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా అన్నది రాజ్యాంగబధ్ధంగా కల్పించిన హక్కు. దాని కోసం తొలి అయిదేళ్ళూ పోరాటం జరిగింది. ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైసీపీ వంటి గట్టిగా జనంలోకి వచ్చాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం పాచిపోయినల లడ్డూలు అంటూ కేంద్రం మీద ఘాటుగానే విమర్శలు చేయడంతో జనంలో బీజేపీ పలుచన అయిపోయింది. చివర్లో చంద్రబాబు కూడా బీజేపీని తిట్టిపోసి తానూ చెడి కమలన్ని చెడగొట్టారు. ఇది అసలు కధ బీజేపీ నోటా కంటే వెనక బెంచ్ కి వెళ్ళడం వెనక ఉన్న కధ. మరి ఏపీలో ఇపుడు బీజేపీకి వేయి ఏనుగుల బలం ఎందుకు వస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నపుడు గట్టిగా నినదించిన వైసీపీ ఇపుడు అధికారంలో ఉంది. ఆ పార్టీ కుర్చీలో కూర్చుని ఆరు నెలలు గడచినా ప్రత్యేక హోదా గురించి కనీసం మాట్లాడడంలేదు. జగన్ వైసీపీ గెలిచాకా తొలిసారి ఢిల్లీ వెళ్ళినపుడే అన్నారు కేంద్రానికి మన ఎంపీల అవసరం లేదు కాబట్టి వారిని గట్టిగా కోరలేమని, ఆ విధంగా నైస్ గా జగన్ పార్టీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసింది. దాంతో అధికార పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా పార్లమెంట్ లో ఇంతవరకూ ప్రత్యేక హోదా నినాదం అసలు వినిపించడమే లేదు.పోనీ జగన్ హోదాని వదిలేశారనుకుందాం, టీడీపీ అధినేత చంద్రబాబు అయినా దాన్ని గట్టిగా జనంలోకి తీసుకువెళ్ళవచ్చు కదా. ఇసుక కధలు, ఇంగ్లీష్ కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ అయినా హోదా కోసం ఎలుగెత్తి చాటవచ్చుకదా అంటే ఈ రెండు పార్టీలు కూడా హోదా కోసం గళం విప్పనేవిప్పవని అంటున్నారు. పవన్ అయితే బోల్డ్ గా బయటకు చెప్పేశారు కూడా. జనాలకు ప్రత్యేక హోదా తెచ్చుకోవాలన్న ఆసక్తి లేదు కాట్టి తాము పోరాటం చేయడంలేదని అనేశారు. విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ అనవసరంగా హోదా అంటూ కేంద్రంతో గొడవ పెట్టుకున్నానని కూడా వాపోయారు. ఇక బాబుది కూడా అదే తీరు. కేంద్రంతో దోస్తీకి ఆయన తహతహలాడుతున్నారు. మరి బాబు ఇపుడు హోదా అంటూ ఆయన్ని పక్కకు జరగమంటారు. ఇదీ బాబు మార్క్ రాజకీయంగా చూడాలి.ఇవన్నీ ఇలా ఉంటే తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ కి ఒక లేఖ రాస్తూ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల గురించి పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలతో ప్రత్యేక చర్చ జరిగేలా చూడాలని కోరారు. ఏపీ అడ్డగోలు విభజన పుణ్యమాని దారుణంగా నష్టపోయిందని కూడా ఉండవల్లి అన్నారు. ఆ దిశగా లోక్ సభలో చర్చ జరిగేలా చూస్తేనే కేంద్రం దిగి వస్తుందని ఉండవల్లి అంటున్నారు. మరి జగన్ తన ఎంపీల ద్వారా హోదా గురించి మాట్లాడనిస్తారా, మోడీతో స్నేహాన్ని కోరుకుంటున్న జగన్ ఆయనకు ఇబ్బంది కలిగించే చర్యలకు పూనుకుంటారా అన్నది చూడాలి మరో వైపు టీడీపీ ఎంపీలైనా హోదా ఊసు ఎత్తుతారా అన్నది కూడా పాయింటే. ఇలా వీరెవరూ హోదా గురించి మాట్లాడకుండా కట్టడి చేయబట్టే ఏపీలో బీజేపీ ఘోరంగా ఓడినా కూడా సింహద్వారం గుండా మళ్ళీ దర్జాగా వచ్చేందుకు ఉబలాటపడుతోంది. బీజేపీ రాజకీయ దూకుడుకు బ్రేక్ వేయాలంటే హోదా అంటే చాలదా. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరు .

Related Posts