కత్తి మహేష్ పుట్టిన ఊరు చిత్తూరు జిల్లా ఎల్లమంద. ఆయన తండ్రి కత్తి ఓబులేశు ప్రస్తుతం ఊళ్లోనే ఉన్నారు. అమ్మ కత్తి సరోజమ్మ ఏడాదిన్నర కిందట మరణించారు. మహేష్ అన్న కత్తి రవికుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. చెల్లెలు వాణిశ్రీ సికిందరాబాద్‌లో న్యూట్రిషనిస్ట్‌గా ఉన్నారు. మహేష్ భార్య సొనాలిది కోల్కత్తా. వీరిది ఇంటర్నెట్ ప్రేమ. ఆమె లక్‌నవ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉన్నారు. ఎనిమిదేళ్ల కొడుకు తల్లి దగ్గరే ఉన్నాడు. మహేష్ మాస్ కమ్యూనికేషన్స్‌లో ఎంఏ చేశారు. సినిమా రంగంలో స్థిరపడ్డారు.