YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వంశీ తలనొప్పి తీరిదేలా

వంశీ తలనొప్పి తీరిదేలా

వంశీ తలనొప్పి తీరిదేలా
విజయవాడ,
వల్లభనేని వంశీ. గన్నవరం ఎమ్మెల్యే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఆ పార్టీపైనే విరుచుకుపడుతుండటంతో అధికార వైసీపీ పార్టీకి పెద్ద పని తప్పినట్లయింది. వల్లభనేని వంశీ తెలుగేదేశం పార్టీలో లొసుగులను, ఎన్నికల సందర్భంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఒక్కొక్కటిగా బయటపెడుతుండటం చంద్రబాబుకు చికాకు తెప్పిస్తుంది. వల్లభనేని వంశీని ఇప్పుడు కేవలం తాను పదిశాతం మాత్రమే చెప్పానని, తనను రెచ్చగొడితే మరిన్ని విషయాలు బయటకు చెప్తానని చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.ప్రస్తుతం వల్లభనేని వంశీ అంశాన్ని ఎలా డీల్ చేయాలన్నది ఫార్టీ ఇయర్స్ అనుభవం ఉన్న చంద్రబాబుకు అర్థం కాకుండా ఉంది. వల్లభనేని వంశీని సస్పెండ్ చేసి వదిలేయాలా? లేక బహిష్కరించాలా? అన్న నిర్ణయాన్ని ఎటూ తీసుకోలేక పోతున్నారని తెలుస్తోంది. ఎందుకంటే సస్పెండ్ చేసి వదిలేస్తే ఒక తలనొప్పి. బహిష్కరిస్తే మరొక ఇబ్బందిలా చంద్రబాబు పరిస్థితి తయారయిందంటున్నారు. ఇప్పటికైతే వల్లభనేని వంశీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆయనను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయకూడదో షోకాజ్ నోటీసులో కోరారు.ఇక వల్లభనేని వంశీ కూడా వ్యూహాత్మకంగానే వెళుతున్నట్లు కన్పిస్తుంది. గతంలో పార్టీని వీడిన ఏ టీడీపీ నేత చేయని ఆరోపణలను వల్లభనేని వంశీ చేస్తున్నారు. చంద్రబాబు, నారాలోకేష్ లనే వల్లభనేని వంశీ టార్గెట్ చేసుకున్నారు. సస్పెండ్ చేసి వల్లభనేని వంశీని వదిలేస్తే ఆయన మరింత రెచ్చిపోయే అవకాశముంది. అలాగని పార్టీ నుంచి బహిష్కరిస్తే వల్లభనేని వంశీపై అనర్హత వేటు పడే అవకాశముండదు. బహిష్కరణ వేటు పడాలనే వల్లభనేని వంశీ మరింత రెచ్చిపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు.పైగా మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. వీరందరికీ వల్లభనేని వంశీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయంతో ఊతమిచ్చినట్లవుతుంది. ఇందుకోసం సస్పెన్షన్ తో సరిపెట్టాలా? లేక పార్టీ నుంచి బహిష్కరించాలా? అన్నది చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. దీనిపై చంద్రబాబు సీనియర్ నేతలు, న్యాయనిపుణలతో కూడా చర్చించారని తెలిసింది. వల్లభనేని వంశీ వ్యవహారాన్ని మరికొంత కాలం నాన్చాలని నారా చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద వల్లభనేని వంశీ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలనేది చంద్రబాబు డిసైడ్ కాలేకపోతున్నారట.

Related Posts