YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో టీడీపీకి ఏక్ నిరంజన్

విశాఖలో టీడీపీకి ఏక్ నిరంజన్

విశాఖలో టీడీపీకి ఏక్ నిరంజన్
విశాఖపట్టణం, 
విశాఖ అర్బన్ జిల్లాలో నాలుగు ఎమ్మెల్యే సీట్లను టీడీపీ గెలుచుకుంది. రూరల్ మొత్తం వైసీపీ గాలి వీచినా కూడా సిటీకి వచ్చేసరికి సైకిల్ పరుగులు తీసింది. దాంతో ఫ్యాన్స్ స్పీడ్ తగ్గి రెక్కలు తిరగడం మానుకున్నాయి. ఈ పరిణామంతో పసుపు శిబిరంలో కొంత ధైర్యం నిండగా, వైసీపీలో మాత్రం నైరాశ్యం అలముకుంది. సరే ఇక్కడ బలంతో జిల్లాలోనూ, ఉత్తరాంధ్రలోనూ పార్టీకి మంచి ఊపు తీసుకుని వద్దామని అధినాయకత్వం భావించిన క్రమంలో గట్టి షాక్ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ ఓడిపోయిన తరువాత నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాజీ మంత్రి ఇపుడు అసలుకే ఎసరు తెచ్చేలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆయన వైసీపీ, బీజేపీ ఇలా దాగుడుమూతలాడినా చివరికి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారట. దాంతో తన బ్యాచ్ మొత్తంతో కలసి కమలం కండువా కప్పుకోవడానికి గంటాశ్రీనివాసరావు రెడీ అయిపోతున్నారని టాక్. అదే కనుక జరిగితే విశాఖ టీడీపీలో మిగిలేది ఒకే ఒక్కడు అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.విశాఖ టీడీపీకి నాలుగు దిక్కులుగా నలుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే వీరిలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు తప్ప మిగిలిన ముగ్గురూ పార్టీ జెండా ఎత్తేస్తారని అంటున్నారు. గంటా నాయకత్వంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా కమలం కండువా కప్పుకుంటారన్నది లేటెస్ట్ సమాచారం. ఇందులో గణబాబు గంటాతో పాటే గతంలో టీడీపీని వీడి ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక ఆయనతో పాటే తిరిగి 2014 ఎన్నికలకు ముందు టీడీపీలోనూ చేరారు. ఇపుడు కొత్తగా జత కలుస్తున్నది మాత్రం వాసుపల్లి గణేష్ కుమార్ అంటున్నారు. అదే విధంగా విశాఖ రూరల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న తన అనుచర వర్గంతో కూడా గంటా శ్రీనివాసరావు పార్టీని వీడిపోతున్నారని అంటున్నారు. అయితే వాసుపల్లి వస్తే విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ఎస్ ఏ రహమాన్ గంటాశ్రీనివాసరావు ను అనుసరించరని అంటున్నారు. ఈ ఇద్దరికీ పడకపోవడమే ఇందుకు కారణం. మొత్తానికి విజయనగరం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే మీసాల గీత సహా పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా గంటాశ్రీనివాసరావును అనుసరించేవారి జాబితాలో ఉన్నారని అంటున్నారు.గంటాశ్రీనివాసరావు కనుక పార్టీని వీడితే విశాఖ జిల్లాలో టీడీపీ సైకిల్ దాదాపుగా షెడ్డుకు పోవడం ఖాయమని అంటున్నారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి కమ్మ సామాజికవర్గానికి చెందిన నేత. పైగా ఆయన బాల‌కృష్ణకు సన్నిహితుడు, ఆయన మాట మీదనే పలు మార్లు టికెట్ దక్కించుకుని గెలుస్తున్నారు. ఆయనకు టీడీపీ అంటే విపరీతమైన ప్రేమ. అదే సమయంలో గంటా అంటే వ్యతిరేకత నిండుగా ఉంది. అందువల్ల ఆయన ఎట్టిపరిస్థితుల్లోనూ గంటాశ్రీనివాసరావు వెంట వెళ్ళరని అంటున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక వెళ్ళిపోతే ఆయన ఒక్కరే ఏక్ నిరంజన్ మాదిరిగా పార్టీకి దిక్కు అవుతారని అంటున్నారు. ఈ విధంగా ఒకే ఒక్క తూర్పు ఎమ్మెల్యేతో టీడీపీ పరిస్థితి తూరుపు తిరిగి దండం పెట్టడమే అవుతుందని అంటున్నారు. మరి చూడాలి

Related Posts