YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ నే ..ఎందుకలా...

లోకేష్ నే ..ఎందుకలా...

లోకేష్ నే ..ఎందుకలా...
విజయవాడ, నవంబర్ 18
అధికారంలో ఉన్నప్పుడు తన సత్తా చూపిన నారా లోకేష్ పై, అప్పుడు నిరాదరణకు గురైన టీడీపీ నేతలు ఇప్పుడు తమ సత్తా చూపిస్తున్నారా? అంటే ఔననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కీలక, ప్రధాన నిర్ణయాలు అన్నీ చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే సాగాయి. అదే సమయంలో సీనియర్ మంత్రులు, నేతలను కూడా నారా లోకేష్ పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలున్నాయి.కలవటానికి కూడా కొంత మందికి సమయం ఇవ్వలేదుట. నాలుగైదుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలకూ లోకేష్ దగ్గర కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయట. అయితే సార్వత్రిక ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. టీడీపీ ఎవరూ ఊహించని రీతిలో 23 సీట్లకు పరిమితమైంది. అంతేకాదు మరోవైపు చంద్రబాబునాయుడి ప్రతిపక్ష హోదా, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేకుండా చేద్దామని ఓ వైపు వైసీపీ, మరోవైపు బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. వారికంటే టీడీపీలో కీలక నేతలు చాలామంది ఇప్పుడు చంద్రబాబు కంటే నారా లోకేష్‌పైనే గుర్రుగా ఉన్నారని పార్టీ వర్గాల విశ్లేషణ. దీనికి ప్రధాన కారణం, ఆయన అధికారంలో ఉండగా వ్యవహరించిన తీరే అంటున్నారు. తాజాగా పార్టీని వీడిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నారా లోకేష్ టార్గెట్ గా తీవ్ర విమర్శలే చేశారు. వర్ధంతికి జయంతికి తేడా తెలియని వాళ్ళ చేతిలో పార్టీ నిలబడుతుందా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వల్లభనేని వంశీ ఈ మాటలు బహిరంగంగా చెప్పారు ఇవే మాటలు అంతర్గతంగా చెప్పే నేతలు, ఎంతమందో ఉన్నారని, టీడీపీలోనే కొందరు మాట్లాడుకుంటున్నారట. అధికారంలో ఉండగా కాంట్రాక్ట్ లు ఇప్పించకపోయినా తాము చెప్పిన పనులు చేయకపోయినా కూడా, పెద్దగా పట్టించుకొనేవాళ్ళం కాదని కానీ లోకేష్ వ్యవహరించిన తీరు ఎక్కువ మంది నేతల మనసును కష్టపెట్టిందన్నది మెజారిటీ నేతల అభిప్రాయమని, కొందరు నేతలు మాట్లాడుకుంటున్నారట. పార్టీని వీడాలనుకుంటున్న గంటా లాంటి నేతలు కూడా లోకేష్ నాయకత్వంలో పని చేయడం కష్టం అనే పాయింట్ వద్దే ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు. తమ భవిష్యత్ నాయకుడు లోకేష్ అంటే ఉహించుకోలేకపోతున్నారు. అయితే, తనపై వంశీ చేసిన వ్యాఖ్యలపై నారా లోకేష్‌ కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. ఆస్తులను కాపాడుకునేందుకే వైసీపీలోకి మారారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు, 2009 నాటి జూనియర్‌ ఎన్టీఆర్‌ విషయం ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు లోకేష్. మొత్తానికి నారా లోకేష్ టార్గెట్‌గా, కొందరు నేతలు సీరియస్ కామెంట్లు చేస్తున్నారు. పార్టీని వీడుతూ తీవ్ర ఆరోపణలు సంధిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ ఈ ఆరోపణల, విమర్శల, టార్గెట్ నుంచి ఎలా బయటపడతారో చూడాలి.

Related Posts