YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

మరింత తగ్గిన బంగారం ధర

మరింత తగ్గిన బంగారం ధర

మరింత తగ్గిన బంగారం ధర
ముంబై, నవంబర్ 18
పసిడి ధర మళ్లీ పడిపోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గింది. దీంతో ధర రూ.39,760కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.36,450కు దిగొచ్చింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. ఏకంగా రూ.650 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.48,000కు క్షీణించింది.ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.38,400కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 క్షీణతతో రూ.37,200కు తగ్గింది.బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా పడిపోయింది. కేజీ వెండి ధర రూ.650 పతనమైంది. దీంతో ధర రూ.48,000కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ఇందుకు కారణం. ఇకపోతే విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 1,467.35 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ఔన్స్‌కు 0.27 శాతం తగ్గుదలతో 16.89 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర గత నెలలో ఏకంగా ఆరేళ్ల గరిష్ట స్థాయి (ఔన్స్‌కు 1,550 డాలర్లకు) చేరిన విషయం తెలిసిందే.బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts