YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం

ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్ 
ఒక సంఘటన జరిగితే ఆతర్వాత వరుసగా అవే సంఘటనలు జరుగతం మనం చూస్తున్నాము..ఇవి తాలియమో, దైవ విర్ణయమో తెలియదు.బుస్సులు బోల్తా పడిటీ వరుసగా జరుగుతాయి. ఆక్సిడెంట జరిగితే  వరుసగా జరుగు తాయి, తాజాగా రైలు ప్రమాదాల సీజన్ కొనసాగుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఏటీవల కాచిగూడలో రెండు రైళ్లు ఢీ మొదలు వరుసగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఊడిపోయింది. అయితే ఈ విషయాన్ని సిబ్బంది గమనించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే గుంటూరు రైల్వే స్టేషన్ లో రైలును నిలిపి వేశారు. 3 గంటలుగా ప్రయాణీకులు ఎన్నో  ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు వెళుతున్న ప్రశాంతి ఎక్స్ ప్రెస్ నిలిచిపోవడం ఇతర రైళ్ల షెడ్యూల్ పై కూడా ప్రభావం చూపింది. ఏసీ కోచ్ చక్రం బోల్ట్ ఎలావూడిందో అర్ధం కావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. అయితే బోల్ట్ వూడినట్లు గమనించడంతో రైలు నిలిపి వేసి, ఏసీ కోచ్ ను రైలు నుంచి విడదీసి మరో బోగిని రైల్వే సిబ్బంది అమర్చారు. అయితే ప్రయాణీకుల కష్టాలు మాత్రం ఎవరూ తీర్చలేదు.

Related Posts