YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు దిశగా ఏపీ రాజధాని అడుగులు?

కర్నూలు దిశగా ఏపీ రాజధాని అడుగులు?

కర్నూలు దిశగా ఏపీ రాజధాని అడుగులు?
అమరావతి
కర్నూలు మీద తాజాగా జరుగుతున్న చర్చ కొత్త వాదనకు తెర మేడికి వచ్చింది.ఉమ్మడి రాష్ట్రంలోనూ.. విభజన తర్వాత సీమ ప్రాంతానికి న్యాయం జరగట్లేదన్న విమర్శకు తెర దించేలా కర్నూలు నగరానికి సంబంధించిన కీలక నిర్ణయం మంచిదేనంటున్నారు. ఇప్పటికే అమరావతిపై నాటి చంద్రబాబు సర్కారు శంకుస్థాపన చేయటం.. తాత్కాలిక నిర్మాణం పేరుతో వందల కోట్లను ఖర్చు చేయటం తెలిసిందే. రాజధాని కోసం వేలాది ఎకరాల్ని సేకరించటం.. ల్యాండ్ పూలింగ్ విషయంపై జరిగిన రచ్చ తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ సర్కారు.. రాజధాని ఏర్పాటుకు సంబంధించిన అంశాల్ని తేల్చేందుకు జీఎన్ రావు నేతృత్వంలో నిపుణల కమిటీని ఏర్పాటు చేయటం తెలిసిందే.ఈ కమిటీ చేసే సూచనల ఆధారంగా రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పర్యటించి.. రాజధానిపై ప్రజల అభిప్రాయం ఏ రీతిలో ఉందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా ఈ కమిటీ కర్నూలులో పర్యటిస్తోంది. కర్నూలు పట్టణానికి దగ్గర్లోని ఓర్వకల్లు ఎయిర్ పోర్టు దగ్గర భూములు సిద్ధం చేయాలని అధికారులకు చేసిన సూచన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేయటంతో పాటు.. శాశ్వత మంచినీటి సరఫరా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెబుతున్నారు. ఎయిర్ పోర్టు సమీపంలో భూములు సిద్ధం చేయాలని జీఎన్ రావు కమిటీ చెప్పటం ఆసక్తికరంగా మారటమే కాదు.. కొత్త ఊహాగానాలకు తెర తీసినట్లైంది.హైకోర్టు ఏర్పాటు కోసమే భూముల్ని సిద్ధం చేయాలని కమిటీ చెప్పిందా? అన్నది ఇప్పుడు క్వశ్చన్ గా మారింది. అయితే.. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రానప్పటికీ.. కమిటీ చేసిన సూచనతో ఎవరికి వారు తమకు తోచిన రీతిలో వాదనలు వినిపిస్తున్నారు.జీఎన్ రావు కమిటీతో కర్నూలు కలెక్టర్.. ఎస్పీలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రోడ్డు.. రైలు మార్గాల్ని ఆధునీకరించాలని.. మెడిటెక్ సిటీ ప్రాజెక్టు మంజూరు చేయాలని కర్నూలు కలెక్టర్ కోరినట్లుగా తెలుస్తోంది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని.. ఎయిర్ పోర్టు ఏర్పాటుతో పాటు.. దీని నిర్మాణాన్ని పూర్తి చేయటానికి అవసరమైన నిధుల్ని వెంటనే విడుదల చేయాలని కోరటం గమనార్హం.ఏపీ రాజధానిపై నెలకొన్న సస్పెన్స్ తెలిసిందే.

Related Posts