జూనియర్ ఎన్టిఆర్ అక్కర్లేదు
విజయవాడ నవంబరు 18
తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్.టి.ఆర్.అవసరం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ ఈ అంశం ప్రస్తావించారు. తమకు జూనియర్ ఎన్.టి.ఆర్.అవసరం లేదని, తమ నాయకుడు ,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే స్ట్రాంగ్ అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లు చేసిన వ్యాఖ్యలకు గాను రామయ్య ఈ సమాదానం ఇచ్చారని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయవర్గాలలో కూడా జూనియర్ ఎన్.టి.ఆర్. అంశం హాట్ టాపిక్ గా మారిన నేపద్యంలో వర్ల రామయ్య ద్వారా చంద్రబాబు నాయడు ఈ క్లారిటీ ఇప్పించారనుకోవచ్చా!