YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అగ్రి మిషన్ పై సీఎం సమీక్ష

అగ్రి మిషన్ పై సీఎం సమీక్ష

అగ్రి మిషన్ పై సీఎం సమీక్ష
అమరావతి  
ముఖ్యమంత్రి  క్యాంపు కార్యాలయంలో అగ్రిమిషన్పై సీఎం  వైయస్.జగన్ సమీక్ష జరిపించారు. ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని హాజరు అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్ ను  వైయస్.జగన్ ప్రారంభించారు. సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు రైతు భరోసా కింద లబ్ధి అందింది. రూ. 5,185.35 కోట్ల పంపిణీ చేసాం. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం వుంటుందని అన్నారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగుచేసుకుంటున్న రైతులనూ రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రైతు  భరోసాతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని వ్యవసాయశాఖ మంత్రి వివరించారు. వచ్చే రెండో విడత నాటికి మరింత మందికి  లబ్ధి చేకూరుతుందన్న రెవిన్యూశాఖమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉందన్న సీఎం, వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు.  రైతు భరోసాను విజయవంతంగా అమలు చేసిన అధికారులకు అగ్రికల్చర్ మిషన్ ధన్యవాదాలు తెలిపింది. భేటీ వివరాలను మంత్రి కన్నబాబు మీడియాతో వివరించారు. 

Related Posts