YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

వచ్చేఅవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి మంత్రి హరీష్ రావు

వచ్చేఅవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి మంత్రి హరీష్ రావు

వచ్చేఅవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి మంత్రి హరీష్ రావు
సిద్ధిపేట
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీష్ రావు అన్నారు. కష్టపడి పనిచేస్తే వ్యవసాయం కూడా మంచి లాభాలనిస్తుందని, యువత తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొందాలన్నారు. సిద్ధిపేటలో మెప్మా ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా భవితవ్యంపై నిరుద్యోగ అభ్యర్థులకు మంత్రి హరీష్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ ఛైర్‌పర్సన్ రోజా శర్మ, సుడా ఛైర్మన్ రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.'స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఏదో ఒక ఉద్యోగంలో చేరండి. ఇది మీ అభివృద్ధికి తొలి మెట్టుగా భావించండి. ఇంటిని వదలండి..చిన్న ఉద్యోగంతో తొలి అడుగు వేయండి. యువత సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారుతున్నారు. ఇవాళ ఉద్యోగం రానివారికి మళ్లీ శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇప్పిస్తాం. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడవద్దు. ఏదో ఒక పనిచేయడం అలవాటు చేసుకోండి. ప్రైవేట్ రంగంలోనూ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. లక్ష్యాలను ఎంచుకొని యువత ముందుకు సాగాలని' హరీష్ రావు పేర్కొన్నారు.

Related Posts