YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

వారిద్దరి ప్రాణాలకు ముప్పు

వారిద్దరి ప్రాణాలకు ముప్పు

వారిద్దరి ప్రాణాలకు ముప్పు
హైద్రాబాద్, 
ఆహారం తీసుకోకపోతే ఆర్టీసీ జేఏసీ నేతలు ఆశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు. వారిద్దరూ షుగర్‌తో బాధ పడుతున్నారని.. ఈ సమయంలో ఆహారం తీసుకోకపోతే కష్టమని ఉస్మానియా ఆస్పత్రి ఆర్‌ఎంవో రఫీ తెలిపారు. పోలీసులు నిరశన దీక్షను భగ్నం చేయడంతో.. కార్మిక సంఘల నేతలు ఆశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డి ఉస్మానియా ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. దీక్ష విరమించి ఆహారం తీసుకోవాలని వారిని కోరినట్లు డాక్టర్ రఫీ చెప్పారు.ఇరువురు నేతలకూ ప్రస్తుతం బీపీ, షుగర్‌ స్థాయులు బాగా పెరిగిపోయాయని సోమవారం ఉదయం అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డిని పరీక్షించిన డాక్టర్ రఫీ చెప్పారు. వారికి సెలైన్స్‌, ఫ్లూయిడ్స్‌ ఎక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు.మరోవైపు.. ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామ, రాజిరెడ్డిని పలువురు నేతలు పరామర్శించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు కురిపించారు.ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేసీఆర్‌కు భయంపట్టుకుందని, ఆయన అభద్రతా భావంలో ఉన్నారని విమర్శించారు. మంగళవారం నాటి సడక్‌ బంద్‌కు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని తెలిపారు. ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామ రెడ్డి, రాజిరెడ్డిని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

Related Posts