YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మంత్రులకు ఇంగ్లీషు ట్యూటర్లు కావలెను..

మంత్రులకు ఇంగ్లీషు ట్యూటర్లు కావలెను..

మంత్రులకు ఇంగ్లీషు ట్యూటర్లు కావలెను..
గుంటూరు,
ఇంగ్లీష్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో వచ్చే ఏడాది నుంచి బోధన చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. దానికి విపక్షాలు గట్టిగానే అడ్డుతగలుతున్నాయి. తెలుగు చచ్చిపోతుందని కూడా అనేస్తున్నాయి. మాతృ భాష మీద గౌరవం లేదా అంటూ తూలనాడుతున్నాయి. ఇక ఈ విషయంలో కులాన్ని మతాన్ని కూడా తీసుకువస్తున్నాయి. ఇంగ్లీష్ విద్యా బోధన అంటే పూర్తిగా క్రైస్తవ మత ప్రచారమేనని కూడా ఘాటైన పదజాలమే ఉపయోగిస్తున్నాయి. సరస్వతీదేవిని పూజించని వారే ఇలా ఆంగ్ల బాష కోరుకుంటున్నారని అంటున్నారు. మరి ఇంతలా చిచ్చు పెడుతున్న ఇంగ్లీష్ బోధన విషయంలో వైసీపీ మంత్రులు కూడా రివర్స్ అటాక్ చేస్తున్నారు. ఇంగ్లీష్ రాకపోతే ఎందుకు పనికిరారని వారు వాదిస్తున్నారు. తెలుగులో విద్యా బోధన వల్ల ఎటూ కాకుండా పోయిన తరాలను గుర్తు చేస్తున్నారు. మరి కొందరు మంత్రులు మరో అడుగు ముందుకేసి తాము ఇంగ్లీష్ రాక నానా అవస్థలు పడుతున్నామని స్వీయ అనుభవం చెప్పుకుంటున్నారు. ప్రత్యేకించి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమకు ఇంగ్లీష్ వంటబట్టక పడ్డ పాట్లు బాహాటంగానే వ్యక్తం చేశారువైసీపీ క్యాబినేట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తనకు ఇంగ్లీష్ రాదని ఒప్పేసుకున్నారు. మీడియా సాక్షిగా ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్ వంటబట్టకపోవడం వల్ల సీనియర్ మంత్రిగా ఉన్నా కూడా తాను దూకుడుగా ముందుకు సాగలేక పోతున్నానని ఆయన చెప్పుకున్నారు. మూడు సార్లు మంత్రిగా అయితే చేశాను, కానీ అధికారులు చెబుతున్న ఇంగ్లీష్ అర్ధం చేసుకోవడంతో ఇబ్బందులు ఇప్పటికీ పడుతున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. తాను పూర్తిగా తెలుగు మీడియంలో చదవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన అంటున్నారు. చిన్న నాటి నుంచే ఆంగ్ల బోధన చేస్తే పైకి వచ్చాక ఎన్నో ఉన్నత పదవులు చేపట్టడానికి ఇంగ్లీష్ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని బొత్ససత్యనారాయణ అంటున్నారు. మొత్తానికి ఈ పెద్దాయన ఎలాంటి జంకూ గొంకూ లేకుండా నాకూ ఇంగ్లీష్ రాదు, ఏంసేస్తామంటూ తన ప్రాంత యాసలో చెప్పుకున్నారు.ఇక పిన్న వయసులోన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జగన్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న పుష్ప శ్రీవాణి సైతం ఇంగ్లీష్ తనకు రాదు అంటున్నారు. తాను టెన్త్ వరకూ తెలుగు మీడియమేనని, ఆ తరువాత ఇంటర్, డిగ్రీ కూడా తెలుగులోనే చదివానని చెబుతున్నారు. ఆంగ్ల భాషపై పట్టు లేకపోవడం తనకు ఉప ముఖ్యమంత్రిగా ఇబ్బందిగానే ఉందని ఆమె బొత్స తో గొంతు కలిపారు, ఇలా ఇంకెంతమంది వైసీపీ మంతులు ఇంగ్లీష్ రాక అవస్థలు పడుతున్నారో మరి. ముందు వీరికి ఆంగ్ల భాష మెరుగుదల కోసం ట్యూషన్లు పెట్టే కార్యక్రమమేదైనా జ‌గన్ చేస్తారా అన్నది చూడాలి. ఇంగ్లీష్ బోధన ఎంత ముఖ్యమో చెబుతున్న వారిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి వైసీపీ తరఫున గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలలో ఎంతమందికి ఆంగ్లంలో చదవడం, రాయడం వచ్చో కూడా ముఖ్యమంత్రి జగన్ చెక్ చేసుకోవాలని సెటైర్లు పడుతున్నాయి

Related Posts