కేసీఆర్ హఠావో, తెలంగాణకు బచావో
హైదరాబాద్ నవంబర్ 19
ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా తెలంగాణలో పేద ప్రజల కోసం కేసీఆర్ హఠావో, తెలంగాణకు బచావో నినాదం తో పోరాటాలు చేయాలి. న్యాయవ్యవస్థ మీద కూడా ప్రజలపై నమ్మకం లేకుండా పోయిందని కాంగ్రెస్ సినీయర్ నేత వి హనుమంతరావు అన్నారు. మంగళవారం అయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. 45 రోజులు విచారణ జరిపి ఇప్పుడు లేబర్ కోర్ట్ కు పొమ్మనడం వల్ల ప్రజలకు న్యాయం పైన విశ్వాసం పోతుంది. డ్రైవర్ నగేష్ నా చావుకు ప్రభుత్వాన్ని కారణంగా కేసీఆర్ ను చూపించారు. కోర్ట్ ఎందుకు సుమోటో కేసు ఎందుకు నమోదు చేయడం లేదు. ఇందిరా గాంధీ అమలు చేసిన భూ సంస్కరణలు తెలంగాణలో అమలు కావడం లేదు. రెవెన్యూ లో అక్రమాలు పెరిగిపోయాయని అన్నారు. ఇవన్నింటిపైన పోరాటానికి కేసీఆర్ హఠావో, తెలంగాణ బచావో నినాదంతో ముందుకు పోతాం. 30వ తేదీ తర్వాత ప్రణాళిక చేస్తామని విహెచ్ అన్నారు.