YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

బాలికలు, విద్యార్థులు ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి  ఘనంగా ఇందిరాగాంధీ 102 వ  జయంతి వేడుకలు 

బాలికలు, విద్యార్థులు ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి  ఘనంగా ఇందిరాగాంధీ 102 వ  జయంతి వేడుకలు 

బాలికలు, విద్యార్థులు ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కృషి 
ఘనంగా ఇందిరాగాంధీ 102 వ  జయంతి వేడుకలు 
ఎమ్మిగనూరు నవంబర్ 19 
ఎన్ ఎస్ యూ ఐ వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఉక్కుమనిషి భారతదేశ    మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి  ఇందిరా గాంధీ 102  వ జయంతి వేడుకలను ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో స్థానిక ఉర్దూ పాఠశాలలో  చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలతో నివాళులర్పించారు .ఈ సందర్భంగా ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ యాదవ్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ భారతదేశానికి వరుసగా మూడు సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని ,బ్యాంకుల జాతీయకరణ రాజభరణాల రద్దు లాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ఘనత ఇమెదని కొనియాడారు . గరీబీ హఠావో నినాదంతో పేదలకు అండగా నిలిచి ఇరవై సూత్రాల పథకాన్ని అమలు చేసిన ఘనత అని,ఉక్కు మహిళగా ఆమె ఆనాడు తనదైన శైలిలో అనేక పత్ర పథకాలకు ముద్ర వేసిన ఘనత  ఈ మెదని తెలిపారు .బిసి .ఎస్సీ .ఎస్టీ. మైనార్టీ వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు .మహిళా విద్యార్థులు బాలికలు తమను ఆదర్శంగా తీసుకుని అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ నాయకులు భాస్కర్ ,అజయ్, గిడ్డయ్యా,రాజు,రాముడు  మరియు  పాఠశాల విద్యార్థులు ,విద్యార్థినులు పాల్గొన్నారు.

Related Posts