న్యాయవాదుల మధ్య విభేదాలు
కర్నూలు నవంబర్ 19
కర్నూలు కోర్టు ఆవరణలో న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో న్యాయవాదులు తోపులాటకు దిగారు. కోర్టులో విధుల బహిష్కరణ విషయంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. 62 రోజులుగా న్యాయవాదులు విధులు బహిష్కరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. అయితే విధుల బహిష్కరణ కొనసాగించాలని కొందరు… కోర్టులకు వెళ్లాలని మరికొందరు పేర్కొంటుండటంతో న్యాయవాదుల మధ్య ఉద్రిక్తత ఏర్పడింది.