YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

 కాంగ్రెస్ ను చూసి నేర్చుకోవాలి

Highlights

  • బీజేపీకి రామ్ విలాస్ పాశ్వాన్ హితవు 
  • రాజకీయ అంచనాలో దిట్ట 
  • దీనిపై ట్విట్టర్లో పలువురు ట్వీట్ల స్పందన 
 కాంగ్రెస్ ను చూసి నేర్చుకోవాలి

సమ్మిళిత సమాజాన్ని నిర్మించడం ఎలాగన్నది కాంగ్రెస్ నుంచి బీజేపీ నేర్చుకోవాలని లోక్ జనశక్తి (ఎల్జేపీ) అధినేత, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ప్రకటించడంతో ట్విట్టర్లో ఎంతో మంది దీనిపై స్పందించారు. రాజకీయంగా ఏం జరగబోతోంది, ఎన్నికల్లో ఏ పార్టీకి విజయావకాశాలు ఉంటాయనే విషయంలో ముందుగానే ఊహించి కచ్చితంగా చెప్పడంలో  అందెవేసిన చేయిగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.గతంలోనూ పాశ్వాన్ ఎవరు విజేత కాగలరన్న విషయంలో ముందస్తు అంచనాలు వేసుకుని కేంద్రంలో అధికారాన్ని పంచుకున్న సందర్భాలున్నాయి. అటువంటి నేత కేంద్రంలో భాగస్వామ్య పక్షంగా ఉంటూనే ఇలా వ్యాఖ్యానించడం వెనుక తగినంత అర్థం ఉంటుందంటున్నారు. తాజా పాశ్వాన్ వేసిన రాజకీయ అంచనాలపై ప్రశంసల వెల్లువవెదజల్లుతుంది. దీనితో  అత్యంత కచ్చితమైన వాతావరణ అంచనా వేయగల వ్యక్తిగా ఆయన్ను అభివర్ణిస్తూ ట్వీట్లు పెట్టేస్తున్నారు. వీరు ఈ విధంగా అనడం వెనుక వాస్తవాలు లేకపోలేదు. ‘పాశ్వాన్ భారత దేశంలో అత్యంత కచ్చితత్వంతో కూడిన నిపుణుడు. అంచనాలు వేయడంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది; పాశ్వాన్ అత్యంత అధునాత వాతావరణ అంచనాలు వేసే భారత దేశ శాటిలైట్; మోదీ నిజంగా ఆందోళన చెందాల్సిందే. ఎందుకంటే రామ్ విలాస్ పాశ్వాన్ కంటే ఏ పోల్ ఏజెన్సీ కూడా ఎన్నికల ఫలిాతాలను అంత కచ్చితంగా అంచనా వేయలేదు’ అంటూ ట్విట్టర్లో పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
 

Related Posts