YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు తెలంగాణ

తుడుం దెబ్బ అందోళన

తుడుం దెబ్బ అందోళన

తుడుం దెబ్బ అందోళన
ఆదిలాబాద్ 
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆదివాసీ మహిళలు కదంతొక్కారు. సమస్యలపై గళమెత్తారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్తో ఆదిలాబాద్ జిల్లా  ఉట్నూరులో తుడుందెబ్బ ఆదివాసీ మహిళా సంఘం చేపట్టిన ఐటీడీఏ ముట్టడి కార్యక్రమానికి వేలాదిగా ‘గిరి’బిడ్డలు తరలి వచ్చారు.  తొలుత  కుమురం భీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం తుడుం మోగిస్తూ నృత్యాలు చేస్తూ నినాదాలిస్తూ  అక్కడి నుంచి భారీ ర్యాలీగా వచ్చి ఐటీడీఏలోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసులకు ఆదివాసీ మహిళలకు మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఐటీడీఏ ఇన్ఛార్జి పీఓ గోపి వచ్చి వారికి నచ్చజెప్పారు. వారి నుంచి వినతిపత్రం స్వీకరించారు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హమీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్బంగా ఆదివాసీ మహిళా సంఘం నాయకులు మాట్లాడుతూ  తాము చేస్తున్న ఉద్యమం న్యాయమైనదని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి చూడాలని, మౌనం వీడాలని ఆదివాసీ మహిళా సంఘం నాయకులు అన్నారు. అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలను తొలగించేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. ఏజెన్సీయేతర ప్రాంతాలను ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

Related Posts