కలసికట్టుగా వుండాలి
ఏలూరు
టిడిపికి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలని టిడిపి అధినేత చంద్రబాబు శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 15 నియోజకవర్గాల్లో టిడిపి విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా పని చెయ్యాలని కోరారు.పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. వెనుకబడిన వర్గాలకు టిడిపిలో ఎప్పుడూ ప్రాధాన్యం ఉంటుందని గుర్తు చేశారు.అన్ని పదవుల్లో యువత, మహిళలు 33 శాతం ఉండాలని సూచించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో టిడిపికి ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూనే భవిష్యత్ లో పార్టీని బలోపేతం చేసేలా కలసి కట్టుగా ముందుకు సాగాలని కోరారు.