YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం విద్య-ఉపాధి తెలంగాణ

యంత్రాలతో వరి చేల కోతలు..  ఆందోళనలో కూలీలు...

యంత్రాలతో వరి చేల కోతలు..  ఆందోళనలో కూలీలు...

యంత్రాలతో వరి చేల కోతలు.. 
ఆందోళనలో కూలీలు... 
వనపర్తి నవంబర్ 19
వరిచేల కోతలను యంత్రాలతో చేయడంవల్ల కూలి పని దొరకక కూలీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా యంత్రాలతో వ్యవసాయ పనులు చేయడం వల్ల కూలీలు అయోమయంలో పడిపోయారు. దున్నడం ప్రారంభం నుంచి వరి చేను కోతలు వరకు యంత్రాలతో చేస్తుండడం వల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని కూలీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులందరూ కూడా వరి చేను కోతల  లో నిమగ్నమై పోయారు. దీంతో ప్రతి రైతు కూడా వరి కోత మిషన్ లపై ఆధారపడి వాటిచే వారి పంటలను కోయడం వంటివి జరుగుతున్నాయి. దీంతో రెక్కాడితే డొక్కా డని కూలీలంతా కూడా ఇతర మండలాలకు కూలి కోసం వలస వెళ్లడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ మిషన్ల వల్ల సులభంగా వరిచేల కోతలను కోయిస్తూ నేరుగా ధాన్యాన్ని ట్రాక్టర్ లో పోసుకొని ఆరబెట్టి మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు అంటుండగా రైతుల వల్ల తాము కూడా జీవనోపాధి పొందుతున్నామనీ వరి కోత మిషన్ ల యజమానులు అంటున్నారు. కూలీలకు బాగా డిమాండ్ పెరగడం వల్ల మిషన్ లచే వ్యవసాయం పనులు చేయిస్తూ డబ్బు, శ్రమ వృధా కాకుండా చూసుకుంటున్నామని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా యంత్రలతో పనులు చేయించడం వల్ల తమకు కూలీల బెడద తగ్గిందని రైతులంటుండగా యంత్రాలతో పనులు చేయించడం వల్ల తమకు కూలి పని దొరకక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని కూలీలు ఆవేదనలు వ్యక్తపరుస్తున్నారు

Related Posts