సెల్ఫ్ డిఫెన్స్ పైన గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం
గోనెగండ్ల నవంబర్ 19
ఆంధ్రప్రదేశ్ మహిళా సమతా సొసైటీ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్ రాధా రాణి ఆధ్వర్యంలో గోనెగండ్ల మండలం లోని గంజహళ్లి గ్రామంలో గ్రామస్థాయి యందు సెల్ఫ్ డిఫెన్స్ కమ్యూనిటీ మీటింగ్ చేయడం జరిగింది సమాజంలో లో పిల్లలపై పై జరుగుతున్న హింసలను దాడులను అరికట్టేందుకు కావలసిన సామర్థ్యాలను సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్ ద్వారా ఎలా ఆడపిల్లలకు నేర్పించాలి నేర్పించే విధానం లో తల్లిదండ్రుల యొక్క పాత్ర బాధ్యతలు ఏమిటి అనేది అవగాహన చేయడం జరిగింది సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు పిల్లలకు మగపిల్లలతో సమానంగా ఆడ పిల్లలను కూడా క్రీడలలో పాల్గొనేటట్లు కుటుంబంలో ఈ విధంగా అవగాహన చేయాలి అనేది గ్రామస్తులు అందరికీ అర్థం చేయించడం జరిగింది ప్రభుత్వం నుంచి పాఠశాలలో అమలులో ఉన్న సెల్ఫ్ డిఫెన్స్ మెథడ్స్ ను పాఠశాల యందు అమ్మాయిలు వినియోగించుకునే విధంగా టీచర్స్ తల్లిదండ్రులు ఏ విధంగా అవగాహన చేయాలి అనేది అర్థం చేయిస్తూ పిల్లలకు ప్రయాణం చేసేటప్పుడు స్వీయ సంరక్షణ వస్తువులను వినియోగించే అవసరత ఉపయోగాలను అవగాహన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం నందు గ్రామస్తులు సచివాలయ ఉద్యోగులు గ్రామ సర్వేయర్ లు. పాల్గొన్నారు.