YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 స్వార్ధంతో మిత్రత్వానికి తూట్లు

 స్వార్ధంతో మిత్రత్వానికి తూట్లు

 స్వార్ధంతో మిత్రత్వానికి తూట్లు
ముంబై. నవంబర్ 19,
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేన కూటమి మధ్య చిచ్చు రేగడంపై ఆరెస్సెస్‌ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం పరస్పర అనుబంధంతో సాగిన ఈ రెండు పార్టీలు ఏ అంశంపై కీచులాటలకు దిగినా అది ఇరు పార్టీలకు నష్టమని బీజేపీ, శివసేనల విభేదాలను ప్రస్తావిస్తూ ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారు. స్వార్ధం అనేది చేటని ప్రతిఒక్కరికీ తెలిసినా చాలా కొద్ది మందే తమ స్వార్ధాన్ని విడనాడతారని నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. అధికార పంపకంపై బీజేపీ, శివసేనల ఘర్షణతో ఇరు పార్టీలు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గడువులోగా ఏ ఒక్క పార్టీ ముందుకురాకపోవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాను బీజేపీ వ్యతిరేకించడంతో ఇరు పార్టీలతో కూడిన కూటమికి తూట్లు పడగా, తాజాగా ఎన్సీపీ కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

Related Posts