పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు నేనెప్పుడూ ఊహించలేదు. ఎవరికి మేలు చేయడానికి ఈ తరహా విమర్శలు అంటూ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్ లో అన్నారు. నాకు మోదీ కి మధ్య విబేధాలు ఉండడం వల్లే తనకి మోదీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అని పవన్ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చంద్రబాబు ఎంపీ లతో అన్నారు. ప్రతిపక్షం చేస్తే ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకునే వాడిని కాదని కానీ తమ మిత్రుడిగా భావించిన పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాల బాధ కలిగించిందని అన్నారు. అసలు తనకి మోదీ కి మధ్య ఉన్న విబేధాలు నిరూపించాలని, అలానే లోకేష్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలని చెప్పారు. ఇక పవన్ చేస్తున్న వ్యాఖ్యలను పార్టీ సభ్యులు అందరు తిప్పికొట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు.