పార్టీలు మారే ప్రసక్తి నాకు లేదు
విజయవాడ నవంబర్ 20
ముఖ్యమంత్రి జగన్ ని కలిసి గన్నవరం నియోజకవర్గంలో సమస్యలు వివరించాను. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని మరింత బలోపేతం కోసం నావంతు కృషి చేస్తానని వైకాపా నేత యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. జగన్ కు నేను పెద్ద అభిమానిని. జగన్ పై ఇష్టంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. జగన్ కోసమే పనిచేస్తానని అన్నారు. సీఎం అయిన నాలుగవ రోజు ఓటమి పాలైన నా గురించి ఆలోచించిన మంచి వ్యక్తి జగన్. సీఎంతో భేటీలో వంశీ ప్రస్తావన అంశమే రాలేదు. సీఎం నిర్ణయం ఎలాంటిదైన స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. నియోజకవర్గ కార్యకర్తలకు అండగా ఉంటా,వారి సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తా. వంశీ పార్టీలోకి రాలేదుగా వచ్చిన తరువత ఆలోచన చేద్దాం. ఎప్పుడు వస్తాడో ఆయాన్నే అడగండి. వంశీ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని అన్నారు. నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించడానికి వచ్చాను. సమస్యలు సృష్టించడానికి నేను రాలేదు. నేను క్యారెక్టర్ ఉన్న వ్యక్తిని. పార్టీలు మారే ప్రసక్తి నాకు లేదని అన్నారు. వంశీ ప్రభుత్వ పథకాలకు ఆకర్షించబడ్డాడా.. కేసులకి బయపడ్డాడో ఆయనకే తెలియాలి. ఇళ్ల పట్టాలని టీడీపీ నేతలు పంచినది వాస్తవం కాదా.. ఎన్నికలు ముందు దొంగ పట్టాలు పంచారు. వారందరికీ మళ్ళీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉందని అన్నారు. ఉపఎన్నికలు వస్తే ఎవరు పోటీ అనేది జగన్ నిర్ణయిస్తారు. జగన్ ఎ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి పనిచేస్తానని అయన అన్నారు.