YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబువి బురదచల్లే ప్రయత్నాలు

చంద్రబాబువి బురదచల్లే ప్రయత్నాలు

చంద్రబాబువి బురదచల్లే ప్రయత్నాలు
తాడేపల్లి నవంబర్ 20,
మొన్నటివరకు ఇసుక, దాడులు, ఇప్పుడు ఇంగ్లీషు ప్రతి విషయంలో బురదచల్లే  యత్నం చేస్తున్నారు. కులమతాలను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తూ కుట్రలు పన్నుతున్నారు. టిడిపి నేతల దౌర్జన్యాలపై కేసులు పెట్టకూడదా అని ప్రభుత్వ ఛీఫ్ విప్  గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పోలీసులను సైతం బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. పోలీసు అధికారులను బెదిరించేధోరణిగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. తను అధికారంలో ఉన్నప్పుడు టిడిపి కార్యకర్తలు కాల్ మని సెక్స్ రాకెట్ చేసినా వదిలివేయండి అని చంద్రబాబు చెప్పారు. ఆరోజు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేశారు.ఈరోజు ఆధారాలతో కేసులు పెడుతుంటే తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు.మీరు మీ హయాంలో లా చట్టవ్యతిరేకంగా పోలీసులు  పని చేస్తున్నారనుకుంటున్నారు.కాని మాది ప్రజాస్వామ్యయుతమైన ప్రభుత్వం కాబట్టి చట్టబద్ద పాలన సాగుతుంది.చట్టానికి అందరూ సమానమే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంతపెద్ద వ్యక్తి తప్పుచేసినా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. మీరు తప్పులు చేస్తూ హత్యారాజకీయాలు చేస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? ఏ పార్టీ వ్యక్తి అయినా తప్పులు చేస్తే చర్యలు తప్పవు. నాకు నోటీసులు ఇస్తారా అని ఎలా అంటావు.నీవేమైనా చట్టానికి అతీతుడివా? నీవు తప్పుచేసినా నోటీసులు ఇస్తారు.కేసులు పెడతారు. 18 కేసులు ఉన్న చింతమనేనిని బాబాగా అభివర్ణిస్తున్నారు. అరాచకాలను ప్రోత్సహించేవిధంగా చంద్రబాబు మాటలు ఉన్నాయి. చింతనిప్పులా ఉండే చింతమనేని ప్రభాకర్ పై కేసులు పెడతారా అని యనమల రామకృష్ణుడు ప్రశ్నిస్తారని విమర్శించారు. చింతమనేని దాడులకు భయపడి కేసులు పెట్టకూడదనేవిధంగా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చాక అవినీతి,లంచం ఉండవని గర్వంగా చెబుతున్నాం.సిఫార్సులు ఉండవని అధికారం అందరిది కొందరిది కాదని చెప్పాం. నిరుద్యోగయువతకు ఉద్యోగాలు ఇస్తున్నాం.సచివాలయాలలో వాలంటీర్లతో కలుపుకుని నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.ప్రతి జనవరిలో రిక్రూట్ మెంట్ క్యాలండర్ ప్రకటిస్తున్నాం. ర్మికులు,మత్స్యకారులకు ఆర్దికసహాయం చేశాం. ఉగాది నాటికి 25 లక్షలమందికి ఇళ్లపట్టాలు ఇవ్వబోతున్నాం. ఆరోగ్యశ్రీని బలోపేతం చేశాం. రైతులకు పంటలకు మద్దతు ధరలు ఇస్తున్నాం. రాయలసీమలోని వేరుశనగకు రైతులకు నష్టం లేకుండా మధ్దతు ధర ప్రకటించాం. ఇన్ని మంచి కార్యక్రమాలు మీకు కనబడవు.ఏ మీడియా చర్చలు పెట్టవు.ఇంగ్లీషు మీడియం పెడితే క్రిష్టియానిటికోసం అంటూ చర్చలేపారు.వీరు ఇంతకు దిగజారారు అంటే మనుషులా రాక్షసులా అనిపిస్తుందని అన్నారు. మీ పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకున్నారు.వారు ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారందర్ని క్రిష్టియన్ లని ముద్రవేస్తారా?ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు.మనది ప్రజాస్వామ్య దేశం.ఏమనిషికి ఏది ఇష్టం ఉంటుందో దానిని గౌరవించాలని రాజ్యాంగం చెబుతుంది. హిందూత్వం గురించి మాట్లాడుతున్నారు.నీ హయాంలో హిందూ దేవాలయాలను ఎన్ని కూల్చావు. మసీదులు ఎన్ని కూల్చావు. మసీదులకు, చర్చిలకు ఎన్ని నాటకాలు ఆడావు.నీవు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. జగన్  పేదవాడికోసం ఇంగ్లీషు ప్రవేశపెడుతున్నారు.ప్రస్తుత పరిస్దితులలో ఆంగ్లం నేర్చుకోవడం ఎంతోబాగుంటుందని ఆలోచనచేస్తే దానిని సైతం వివాదం చేస్తావని ఆరోపించారు. మాకు తెలుగు పైన ప్రేమలేదనేది ప్రజలలో క్రియేట్ చేయాలనే భావనతో ఇదంతా చేస్తున్నారు.మాకు భాష, తెలుగు సంస్కృతిలపైన మాకున్న ప్రేమ,చిత్తశుద్ది మీకు ఎవరికి లేదని చెప్పి ప్రజలకు తెలుసు. ఇన్ని మంచిపనులు చేస్తున్నా చంద్రబాబు అండ్ కో కు ఎందుకు కనబడటంలేదు.ఎంతసేపటికి  వైయస్ జగన్ గారి కులం,మతం గురించి చర్చ.ఈ పరిస్దితులలో మతాలను,కులాలను రెచ్చగొట్టేవ్యవహారం చేస్తున్నారని అన్నారు. నీవే గతంలో 2004లో అన్నావు.బిజేపిని వదలం అని. ఆ తర్వాత 2009 లో మతతత్వపార్టీ అని చెప్పావు.2014లో తిరిగి పొత్తుపెట్టుకుని తర్వాత 2018లో మోడిని తిట్టావు.2019 ఎన్నికలలో సైతం నీదైన ఇంగ్లీషు భాషలో ఆయనను తిట్టావు.ఎన్నికలయ్యాక తిరిగి నరేంద్ర మోది కాళ్లు పట్టుకున్నావు.
ఈ రోజు నేను సెక్యులర్ వాదిని అని గట్టిగా చెప్పలేకపోతున్నావు.కాంగ్రెస్ వెనక తిరిగి సోనియాగాంధి కాళ్లుపెట్టుకున్నావు .రాజ్యసభలో మీ పార్టీని క్లోజ్ చేసుకున్నావు.తెలంగాణాలో మీ పార్టీ ఫర్ సేల్ అని బోర్డు పెట్టుకున్నావు.ఇక్కడ కూడా మీ పార్టీ ఖాళీ అవుతుంది.23 స్దానాలు నీకు ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధ పడుతున్నారని అయన అన్నారు.  ఈ రోజు నీవు ఎంతసేపూ టిడిపి నేతలు తప్పులు చేస్తే మీపై కేసులు పెట్టారు.తప్పు చేస్తే పెట్టరా?ప్రజలను అడగండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అని.మీలాంటి కుట్రదారులకు 23 స్దానాలు ఇవ్వడం పట్ల కూడా వారు చింతిస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే అది చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు.మీకు మీడియాలో సపోర్ట్ ఉంది కదా అని చెప్పి దిగజారుడు మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.

Related Posts