YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సిటీలోని నిరాశ్రయులకు నైట్ షెల్టర్లలో ఆశ్రయం కల్పించాలి 

సిటీలోని నిరాశ్రయులకు నైట్ షెల్టర్లలో ఆశ్రయం కల్పించాలి 

సిటీలోని నిరాశ్రయులకు నైట్ షెల్టర్లలో ఆశ్రయం కల్పించాలి 
- కమిషనర్ లోకేష్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 20, 
హైదరాబాద్ నగరంలో చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో నగరంలోని నిరాశ్రయులు, అభాగ్యులకు రాత్రివేళలో ఆశ్రయం కల్పించడానికి ప్రస్తుతం ఉన్న నైట్ షెల్టర్లలో ఏర్పాట్లను పూర్తిస్థాయిలో చేపట్టాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. ప్రస్తుత నైట్ షెల్టర్లను తనిఖీచేసి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఇతర ఏర్పాట్లను చేపట్టాల్సిందిగా జోనల్, డిప్యూటి కమిషనర్లను జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ ఆదేశించారు. నేడు జిహెచ్ఎంసి కార్యాలయం నుండి జోనల్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ అధికారులతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫ్రెన్స్ నిర్వహించారు. అడిషనల్ కమిషనర్లు హరిచందన, సిక్తాపట్నాయక్ లు కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫ్ రెన్స్లో కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని ఫుట్పాత్లు, జంక్షన్ల వద్ద రాత్రివేళలో నిద్రించేవారిని నైట్ షెల్టర్లలో ఆశ్రయం కల్పించాలని సూచించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి ద్వారా 15 నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్నామని, వీటిలో దాదాపు 600 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారని పేర్కొన్నారు. నిరాశ్రయులకు రాత్రివేళలో ఆశ్రయం కల్పించడానికి అవసరమైతే ప్రత్యామ్నాయంగా జిహెచ్ఎంసి కమ్యునిటిహాళ్లలో కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో నగరంలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల యాచకుల సంఖ్య అధికంగా ఉందని, దీనిని నివారించేందుకు పోలీసు శాఖ సహాయంతో తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భవన నిర్మాణ  వ్యర్థాల సేకరణ డ్రైవ్లో భాగంగా ఈ వ్యర్థాలను వేసేందుకు ప్రతి వార్డులో ఖాళీ స్థలాలను గుర్తించాలని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో దోమల నివారణ చర్యల్లో భాగంగా 60 వాహనానికి అమర్చిన ఫాగింగ్ యంత్రాలను అందించడం జరిగిందని, ఈ 60 వాహనాల ద్వారా నగరంలోని 9వేల కిలోమీటర్ల ప్రధాన రహదారులలో విస్తృతంగా ఫాగింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. వీటితో పాటు అందుబాటులో ఉన్న 30 మినీ ఫాగింగ్ మిషన్ల ద్వారా స్లమ్లు, బస్తీలు, జనసంద్రత ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. నగరంలో స్ట్రీట్ వెండింగ్ పాలసీని మానవీయ కోణంతో అమలు చేయాలని సూచించారు. వీధివ్యాపారులకు నచ్చచెప్పే దోరణితో ఉండి ఈ పాలసీని అమలు చేయాలని సూచించారు. 2021 జాతీయ జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున ఈ విషయంలో తగు సన్నద్దతతో ఉండాలని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను సేకరణను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

Related Posts