YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

ఉత్తనూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా 

ఉత్తనూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా 

ఉత్తనూర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా 
గద్వాల నవంబర్ 20 :
పాఠశాలల తనిఖీ లలో భాగంగా ఈరోజు జెడ్ పి హెచ్ ఎస్ మరియు ప్రాథమిక పాఠశాలలను జోగులాంబ గద్వాల జిల్లా విద్యాధికారి  పి. సుశీంద్ర రావు సందర్శించారు.  పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించడం జరిగింది. ప్రత్యేకంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో గ్రామర్ సులభంగా నేర్చుకొనుటకు కొన్ని మెలుకువలు తెలపడం జరిగింది. ఇంగ్లీష్ గ్రామర్ పై రకరకాల ప్రశ్నలు సంధించి, విద్యార్థులతో జవాబులు వచ్చే విధంగా వివరించడం జరిగింది. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అందుకు తగ్గట్టు ఇష్టంతో కృషిచేయాలని తెలిపారు.ప్రత్యేక తరగతులుపదవ తరగతిలోని అన్ని సబ్జెక్టులు డిసెంబర్ 15 లోపల సిలబస్ పూర్తి చేసుకొనుటకు మరియు సిలబస్ పూర్తి అయిన సబ్జెక్టులలో పునశ్చరణ తరగతులు నిర్వహించి పరిపూర్ణులుగా తీర్చి దిద్దుట కు జిల్లాలోని అన్ని పాఠశాలలో ఉదయం 8.30 నుండి 9.30 వరకు,  సాయంత్రం 4.45 నుండి 5.45  వరకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నరా ,లేదా అనే విషయంపై పదవ తరగతి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే అల్పాహారాన్ని దాతల సహాయంతో సమకూర్చుకోవాలని ప్రధానోపాధ్యాయునికి తెలపడం జరిగింది.మధ్యాహ్న భోజనంపౌష్టిక విలువలతో కూడిన  భోజనం అందించుటకు ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం అందిస్తున్న  మధ్యాహ్న భోజనం  విషయంపై  ఆరా తీయడం జరిగింది. మెనూ ప్రకారం విద్యార్థులకు శుభ్రత తో కూడిన రుచికరమైన భోజనం అందిస్తున్నారు లేదా అనే విషయంపై వంటగదిని పరిశీలించి వంట మనుషులతో మాట్లాడడం జరిగింది. వారానికి 3 గుడ్లు పెడుతున్నారా అని  విద్యార్థులు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.వాటర్ బెల్ప్రతి మనిషి  రోజు కనీసం 5 లీటర్లు మంచినీరు తాగితేనే ఆరోగ్యంగా ఉండగలడు. అందుకోసం  ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి  మంచినీరు త్రాగే విధంగా రోజు 4 వాటర్ బెల్ లు కొట్టాలని ( ఉ.10.45, మ.12.00, మ.3.00, సా.4.00 )  ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంపై విద్యార్థులతో వాకబు చేసి,  ప్రతి విద్యార్థి మంచి నీరు త్రాగడానికి వాటర్ బాటిల్స్ తెచ్చుకోవాలని సూచించారు.అన్ని వసతులతో ఉత్తనూర్ పాఠశాలలుజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాతల సాయంతో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడం అభినందనీయం. పాఠశాలలో ప్రత్యేకంగా గ్రంధాలయం, సైన్స్ ల్యాబ్, ఇన్నోవేషన్ ల్యాబ్, డిజిటల్ ల్యాబ్ మరియు డైనింగ్ హాల్ లను ఎక్కడలేని విధంగా దాతల సాయంతో తీర్చిదిద్దడం చాలా సంతోషమని, అందుకు ప్రత్యేకంగా సహకరిస్తున్న ఐజ ఎంపీపీ పి.తిరుమల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్టి సౌకర్యాలను ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సక్రమంగా వినియోగించు కోవాలని, వీటిద్వారా విద్యార్థులు మంచి భవిష్యత్తు పొందాలని ఆశించారు. తదనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి  విద్యార్థులను మంచి బోధన ద్వారా ఉత్తమ  విద్యార్థులు గా తీర్చి దిద్దాలని , ముఖ్యంగా ప్రతి సబ్జెక్టులో మూలాలు ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలని, పదవ తరగతి విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు పి. తిమ్మారెడ్డి  , ఉపాధ్యాయులు అనిల్ కుమార్ ,శ్యాంసన్,  లక్ష్మిరెడ్డి, ఆనంద్, అరుణ పాల్గొన్నారు

Related Posts