దేవినేని ఉమకు జైలు తప్పదు
తాడేపల్లి నవంబర్ 20
దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తుంది. మైలవరంలో ప్రజలు బుద్ది చెప్పిన ఉమాలో మార్పు రాలేదు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని చెప్పి చంద్రబాబు ఇసుక దీక్ష వేదిక మీద కూర్చోనివ్వలేదని మైలవరం శాసనసభ్యుడు వసంతకృష్ణప్రసాద్ విమర్శించారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. పోలవరం అనేది రాజశేఖర్ రెడ్డి కలలు పంట. 2018 కల్లా పోవవరం పూర్తి చేస్తామని ఉమా అసెంబ్లీ రాసుకోమన్నారు. పోలవరం 2018కి ఎక్కడ పూర్తి చేశారో ఉమా చెప్పాలి. మీరు చేసిన అవినీతి నచ్చక రివర్స్ టెండరింగ్ సీఎం పెట్టారు..వందలకోట్లు ఆదాఅయింది. ఉమా వెకిలి చేష్టలు చూసి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆరే ఉమా ఆడో మగో తెలియదన్నారు. ఇప్పుడు అదే నిజమవుతుందని అన్నారు. దేవినేని ఉమా పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఉండేది కాదు. దేవినేని ఉమా మంత్రులను పట్టుకొని సన్నాసి అని మాట్లాడడం సరికాదు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి సంస్కారం ఉంది కాబట్టి టీడీపీ నేతలు పట్ల గౌరవంగా మాట్లాడుతున్నారు. దేవినేని ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి..లేదా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దేవినేని ఉమా వెకిలి చేష్టలు మానుకోవాలని అన్నారు. ఏపీలో టీడీపీ అంపశయ్య మీద ఉంది. తెలంగాణలో కనుమరుగైన టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పుకునే అర్హత లేదు. లోకేష్, ఉమా ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకున్నారో ఇచ్చిన వారు త్వరలో మీడియా సమావేశం పెట్టబోతున్నారు. మైలవరం నియోజకవర్గంలో పనుల్లో లోకేష్ కు 5 శాతం ఉమా 3 శాతం చొప్పున కమిషన్లు వసూళ్లు చేశారు. మంత్రిగా చేసిన అవినీతికి దేవినేని ఉమాకు జైల్ జీవితం తప్పదని అయన అన్నారు.