YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రేమించి పెళ్లి…కులం పేరుతో దూరం

ప్రేమించి పెళ్లి…కులం పేరుతో దూరం

ప్రేమించి పెళ్లి…కులం పేరుతో దూరం
హైదరాబాద్ నవంబర్ 20 
స్నేహం చేసాడు, ప్రేమ అన్నాడు నీవు లేనిది నేను లేను అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. , రెండు సంవత్సరాల తరువాత నీ కులం వేరు నా కులం వేరు అని చెప్పి అమ్మాయిని వదిలేసి వెళ్ళాడు. దిక్కుతోచని స్థితి లో తనకు న్యాయం చేయాలనీ అ అమ్మాయి నాచారం పోలీసులను ఆశ్రయించింది.నాచారం కు చెందిన జాన్సీ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సమయం లో సహా ఉద్యోగి శేఖర్ తో పరిచయం స్నేహంగా మారి ప్రేమకు దారితీసింది. వీరివురు పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం తరువాత  నీ కులం వేరు నాకులం వేరు నీవు కట్నం తీసుకొని రా అని చెప్పిన శేఖర్, జాన్సీ వదిలేసి వెళ్ళాడు. పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేసిన శేఖర్ వినకపోవడంతో జాన్సీ నాచారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల విచారణ లో జాన్సీ వదిలివేసి , శేఖర్ మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. దళితురాలినని నన్ను వదిలివేసి మోసం చేసిన శేఖర్ పై చర్యలు తీసుకోవాలని జాన్సీ కోరుతుంది.

Related Posts