సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం భరోసా నిచ్చింది
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 20 (న్యూస్ పల్స్):
సమైక్య పాలనలో కేంద్రం రూపొందించిన తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టాన్ని పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పగడ్బందీ చర్యలు చేపట్టిందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటిజన్లకు వయో శ్రేష్ట సన్మాన్ అవార్డులతో పాటు ప్రశంసా పత్రాలు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతులమీదుగా అందజేశారు. రిటైర్డ్ తాహసీల్దార్ ఏ.రఘుపతి, రిటైర్డ్ పోస్ట్మాస్టర్ అలిశెట్టి ఈశ్వరయ్య, పద్మనాయక సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు వొద్దినేని పురుషోత్తంరావు, తోడేటి శంకర్ గౌడ్, ఎండి యాకుబ్ , వెల్ముల ప్రకాష్, బొబ్బటి కరుణ, చింతకింది కృష్ణయ్యలకు ఎమ్మెల్యే అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా ప్రతినిధులు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి సమస్యల పరిష్కారానికి చేస్తున్న సేవలను అభినందించారు. రాష్ట్రంలోనీ జగిత్యాల జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో వృద్ధుల సంక్షేమ వసతి గృహాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. నిరాదరణకు గురైన వృద్ధుల కేసులను సత్వరం పరిష్కరిస్తూ రాష్ట్రంలో నెంబర్వన్ గా నిలిచిన జగిత్యాల ఆర్డీఓ నరేందర్ ను ఎమ్మెల్యే ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ , జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం, మండల పరిషత్ జగిత్యాల రూరల్ అధ్యక్షుడు గంగారం, టిఆర్ఎస్ నాయకులు మానాల కిషన్, గట్టు సతీష్, క్యా దాసు నాగయ్య, బండారి నరేందర్ , లిం బయ్య, సురేందర్రావు, రాగుల పరుశరామ్ గౌడ్, సింగం గంగాధర్, మరి పెళ్లి పో చాలు, బండారీ విజయ్, పంబల రామ్ కుమార్, గొర్రె విద్యాసాగర్, న లువాల హనుమాన్లు, కప్పల చంద్రమౌళి, నారాయణ, తదితరులు పాల్గొన్నారు