తెలంగాణ మద్యం పట్టివేత
నందిగామ నవంబర్ 20
తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర బోర్డర్ ద్వారా నందిగామ ప్రాంతానికి తెలంగాణ మద్యాన్ని తెచ్చి అమ్మకాలు సాగిస్తున్న ముఠాను నందిగామ ఎక్సైజ్ సిఐ బి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నాడు చాకచక్యంగా దాడి చేసి 3 అక్రమ మద్యం రవాణా దారులను మరో 7 గురు అమ్మకం దారులను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం నాడు నందిగామ ఎక్సైజ్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ రాధాకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కొదాడకు చెందిన కొపలె ప్రకాశరావు (మైఖైల్) ముఖ్య రవాణా దారుడుగా ఉండి నందిగామ మండలం చెరువు కొమ్ము పాలెం గ్రామానికి చెందిన శ్రీరాం భూషయ్య, నందిగామ కు చెందిన బేరోతుల బాలకృష్ణ ఉప రవాణా ద్వారా నందిగామ ప్రాంతానికి తీసుకు వచ్చి చంద్రల రామయ్య పెద్దవరం,పులా లక్ష్మి బాయి చందర్లపాడు,పెసరమిలి స్వామి రాఘవపురం, మల్లా వెంకటేశ్వరరావు నందిగామ అలవాల సొమ్మమ పెనుగంచిప్రోలు,సందిపొగు ఎసుబాబు నందిగామ,గుగులోతు రమేష్ నాయక్ పెద్దవరం ల వద్ద 95 తెలంగాణా రాష్ట్రం మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అలాగే ఈ మద్యం కొదాడ లోని శ్రీ లక్ష్మి వైన్ షాప్ లో నుండి మైఖేల్ తీసుకు వస్తున్నారని, అలాగే మధిర వద్ద మడిపలే లో ఉన్న వైన్ షాప్ లో నుంచి కూడా తీసుకుని వస్తు నట్లు తెలిసి వారిపై కూడా చర్యలు లకు నివేదిక తయారు చేస్తూన మని తెలిపారు ఈ అక్రమ రవాణా ను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు