ఏపీలొ ఇంగ్లీషు మీడియం స్కూళ్లు..నోటిఫికేషన్
విజయవాడ, నవంబర్ 20,
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇంగ్లీష్ మీడియం విద్యను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టనున్నట్లు ఉత్తర్వులో తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దీనిని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరిగా ఉండాలంటూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది