ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానానికి ముకేశ్ అంబానీ
ముంబయి
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చరిత్ర సృష్టించింది. ముఖేశ్ అంబానీకి చెందిన ఆ సంస్థ ఇప్పుడు ఎలైట్ ఎనర్జీ క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి ఇంధన కంపెనీల్లో ఒకటిగా ఆర్ఐఎల్ చోటు సంపాదించింది. ప్రస్తుతం ఆర్ఐఎల్ మార్కెట్ విలువ 138 బిలియన్ డాలర్లుగా ఉన్నది. 132 బిలియన్ డాలర్ల విలువైన బ్రిటీష్ కంపెనీని అది దాటేసింది. ఏడాది కాలంలో రిలయన్స్ షేర్లు మూడు రేట్లు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు 40 శాతం షేర్లు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. దలాల్ స్ట్రీట్‌లో రిలయన్స్ దూసుకువెళ్లడంతో.. ప్రపంచ కుబేరుల్లో ప్రస్తుతం ముకేశ్ అంబానీ 12వ స్థానానికి చేరుకున్నారు. త్వరలోనే పది లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా కూడా ఆర్ఐఎల్ రికార్డు క్రియేట్ చేయనున్నది. ఆసియాలో అతిపెద్ద ఇందన సంస్థ పెట్రోచైనా కంపెనీని కూడా రిలయన్స్ అధిగమిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.