YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో ఆధార్‌ను అనుసంధానం చేయం: ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో ఆధార్‌ను అనుసంధానం చేయం: ర‌విశంక‌ర్ ప్ర‌సాద్

సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో ఆధార్‌ను అనుసంధానం చేయం: ర‌విశంక‌ర్ ప్ర‌సాద్
న్యూఢిల్లీ 
సోష‌ల్ మీడియా అకౌంట్ల‌తో ఆధార్‌ను అనుసంధానం చేసే ఆలోచ‌న ప్ర‌భుత్వానికి లేద‌ని కేంద్ర మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ తెలిపారు. ఇవాళ ఆయ‌న లోక్‌స‌భ‌లో ఓ ప్ర‌శ్న‌కు లిఖిత‌పూర్వంగా స‌మాధానం ఇచ్చారు. ఆధార్ డేటా సంపూర్ణంగా సుర‌క్షితంగా ఉంద‌న్నారు. ఆ డేటాను ఎప్ప‌టిక‌ప్పుడు ఆడిట్ చేస్తున్నామ‌న్నారు. ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ సెక్ష‌న్ 69ఏ ప్ర‌కారం ప్ర‌జా ప్ర‌యోనాల దృష్ట్యా అకౌంట్ల‌ను బ్లాక్ చేసే అధికారం ప్ర‌భుత్వానికి ఉంద‌ని మంత్రి తెలిపారు. గ‌త మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం బ్లాక్ చేసిన యూఆర్ఎల్స్ సంఖ్య‌ను రిలీజ్ చేశారు. ఇజ్రాయిల్‌కు చెందిన పెగాసెస్ స్పైవేర్ గురించి ఎంపీ అస‌ద్ అడిగిన ప్ర‌శ్న‌కు కూడా ర‌విశంక‌ర్ స‌మాధానం ఇచ్చారు. స్పైవేర్ దాడి గురించి ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు చేస్తున్న‌ద‌న్నారు. మ‌న దేశానికి చెందిన 121 ఫోన్ల‌ను ట్యాప్ చేసి ఉంటార‌ని మంత్రి తెలిపారు. పౌరుల ప్రైవ‌సీకి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు.

Related Posts