YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం

కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమణ
ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం
హైదరాబాద్ 
 తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం తీసుకుంది. కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్లు రాజిరెడ్డి, థామస్ రెడ్డి సహా 16 మంది జేఏసీ నేతలు హాజరయ్యారు. హైకోర్టు తీర్పు, సమ్మె కొనసాగింపుపై కీలక చర్చలు జరిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన జేఏసీ నేతలు కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని అశ్వత్థామరెడ్డి తెలిపారు. లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం కూడా ఈ తీర్పును గౌరవించాలని కోరారు. కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. భేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాని, కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని అశ్వత్థామరెడ్డి కోరారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మెను విరమిస్తామని ప్రకటించారు. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్య తీసుకుంటాయని ఆశిస్తున్నామని అన్నారు.

Related Posts