ప్రత్యేక హోదా ఆంధ్ర ప్రదేశ్ కి లైఫ్ లైన్ అని, అన్ని పార్టీలూ అత్యంత కీలకమైన అవిశ్వాస తీర్మానంపై చర్చకు సహకరించాలని వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై తాము అవిశ్వాస తీర్మానం పెట్టామని, దీనిపై చర్చ కొనసాగకుండా బీజేపీ చూస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ప్రత్యేక హోదాపై చర్చను అడ్డుకోవద్దని కోరుతున్నానని ఆయన కోరారు. తన మాట వినమని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే సమయంలో ఇదే పార్లమెంట్ లో హోదాపై హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
SCS is AP’s lifeline! We humbly appeal to all parties in the House to cooperate in this crucial discussion on No Confidence Motion, moved against the Central Government for not granting SCS to AP (1/2)
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 20, 2018