YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చినబాబుకు చెక్ పడినట్టేనా....

చినబాబుకు చెక్ పడినట్టేనా....

చినబాబుకు చెక్ పడినట్టేనా....
విజయవాడ, నవంబర్ 21
దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీని పప్పుగా బిజెపి గట్టి ప్రచారం చేసి విజయం సాధించింది. అవును నేను పప్పునే అని స్వయంగా రాహుల్ అంగీకరించేలా ఆ ప్రచారం నడిచింది. అదే సీన్ ఇప్పుడు ఏపీ లో సాగుతుంది. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ పై గత ఎన్నికల ముందు నుంచి పప్పు… పప్పు అంటూ వైసిపి సాగించిన ప్రచారం నారా లోకేష్ ఇమేజ్ ను ప్రజల్లో బాగా డ్యామేజ్ చేసేసింది. అది ఏ స్థాయిలో అంటే రామ్ గోపాల్ వర్మ తాజాగా తీయబోతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాలో ఏకంగా నారా లోకేష్ ను పోలిన క్యారెక్టర్ పై పప్పు సాంగ్ చిత్రీకరించే రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ సాంగ్ యు ట్యూబ్ ట్రెండ్ లోకి చేరి మిలియన్స్ వ్యూస్ కి చేరిపోయిందంటే చూడండి.ఇప్పుడు వున్న టిడిపి శ్రేణులు తిరిగి అధికారంలోకి రావాలి అంటే చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఆయన ఏకైక కుమారుడు నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ తన లక్ష్యాలను చేరుకోలేదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారని వినికిడి. నారా లోకేష్ కి పట్టాభిషేకం చేసేందుకు సమాయత్తం అవుతున్న తరుణంలో ఈ పరిణామాలు చంద్రబాబు ను తీవ్రంగా లవరపెడుతున్నాయి. టిడిపి ని విడిచి వెళ్లేవారు సైతం పప్పు నాయకత్వంలో పని చేయలేక అసమర్ధుడి ని అందలం ఎక్కించే ప్రయత్నాలు చూడలేకే బయటకు పోతున్నామని తేల్చి చెబుతున్నారు. ఇది మరింత సంక్లిష్ట స్థితిని చంద్రబాబుకి తెచ్చిపెట్టింది. ఈ దశలో పట్టాభిషేకం వాయిదా వేయడమే మంచిదని బాబు తానే పార్టీ భారాన్ని మోసేందుకు సిద్ధపడినట్లు పార్టీ వర్గాల సమాచారం. అందుకే ఇసుక దీక్షను బాబు స్వయంగా చేపట్టారని అంటున్నారు. నారా లోకేష్ దీక్ష ముందు చేసినా అనుకున్న స్థాయిలో అది విజయవంతం కాకపోవడంతో లాభంలేదని పెదబాబు బాధ్యత తీసుకున్నారని పసుపు పార్టీలో చర్చ నడుస్తుంది.చినబాబు నారా లోకేష్ ను మెయిన్ పొలిటికల్ ట్రాక్ ఎక్కించేందుకు చంద్రబాబు సరికొత్త వ్యూహం రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.టిడిపి అధికారంలో ఉండగా ఎమ్యెల్సీని చేసి మంత్రిని చేశారు చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో ప్రజా తీర్పులో మంగళగిరి లో ఓటమి చెందిన నారా లోకేష్ కి నాటినుంచి సొంత పార్టీలోనే వ్యతిరేకత బలంగా పెరిగింది. దొడ్డి దారిన మంత్రి అయ్యావు కానీ ప్రతిభ ఆధారంగా నారా లోకేష్ జీరో అన్నది తేలిపోయిందంటూ ప్రత్యర్ధులు అవహేళన చేసేందుకు ఆయుధం లభించింది. పార్టీలో ట్విట్టర్ బాబు గా మిగిలిపోకుండా ప్రధాన అంశాల్లో తెరపైకి తెచ్చి తన అనుకూల మీడియా లో ప్రచారం దంచేలా చేస్తున్నారు చంద్రబాబు. ప్రజలతో, పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో నారా లోకేష్ నేరుగా మీట్ అయ్యే కార్యక్రమాలను రూపొందిస్తుంది టిడిపి. తరచూ నారా లోకేష్ చేత ప్రెస్ మీట్లు పెట్టించి సానపెట్టే ప్రయత్నాలు రూపొందుకున్నాయి. అందుకే ఇటీవల కాలంలో నారా లోకేష్ తరచూ ప్రెస్ మీట్లు పెట్టి హల్చల్ చేయడం కనిపిస్తుంది. అలా దశలవారీగా చినబాబు ను పార్టీకి పెదబాబు గా చేసే ప్రయత్నాలు చంద్రబాబు అధికం చేసినట్లే కనిపిస్తుంది. అయితే బాబు స్ట్రేటజీ నారా లోకేష్ విషయంలో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి మరి

Related Posts