న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీం కోర్టు తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ముస్లిం పక్షాలు రివ్యూ పిటిషన్ వేసేందుకు సిద్దమయ్యాయి. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయోధ్యపై సుప్రీంకోర్టు వెళ్లిన మొత్తం పది పార్టీలకు గానూ ఏడు పార్టీలు రివ్యూకు వస్తున్నట్టైంది. ఇంతకు ముందు అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ అవసరం లేదంటూ పేర్కొన్న హజీ మెహబూబ్.. తాజాగా స్వరం మార్చడం గమనార్హం. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూకి వెళ్లరాదంటూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు, యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు సహా మరో కీలక కక్షిదారు ఇక్బాల్ అన్సారీ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
కేవైసీ లింక్.. ఖాతా ఖల్లాస్.. సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్