వలసల తిప్ప బ్రిడ్జ్ ను ప్రారంభించిన సీఎం జగన్
కాకినాడ నవంబర్ 21
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువరం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఐ.పోలవరం మండలం వలసల తిప్ప వద్ద 35 కోట్ల రూపాయలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ వై యస్ ర్ వారధి ను సీఎం జగన్ ప్రారంభించారు. తొలుతగా ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారధిని ప్రారంభించి ముఖ్యమంత్రి స్థానికులతో ముచ్చటించారు. వారధి వద్ద ముఖ్యమంత్రికి జిల్లా జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో మాజీ శాసనసభ్యులు తోట త్రిమూర్తులు, స్థానిక నాయకులు ధూళిపాల చక్రం ,ఇరిగేషన్ సూపరిండెంట్ ఇంజనీర్ యం.నాగరాజు తదితరులు ఉన్నారు.ఈ వారధి వలన 12 వేల జనాభా రాకపోకలకు సౌకర్యవంతంగా ఉంటుంది. మొత్తం7 గ్రామాల ప్రజలు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల సౌకర్యం కలుగుతుంది. ఈ బ్రిడ్జి పరిధిలోకి ముమ్మిడివరం, ఐ.పోలవరం, తాళ్ళరేవు, గంగవరం మండలాలు రాకపోకలు జరుగుతాయి. ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ రావు, ఉప ముఖ్య మంత్రి పిల్లి సుభాషచంద్రబాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, ఎంపీలు వంగా గీత ,చింత అనురాధ, శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చర్ల జగ్గరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి , చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ,జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి జిల్లా, ఎస్పి హష్మీ ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు