YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మహారాష్ట్రలో ముందడుగు

మహారాష్ట్రలో ముందడుగు

మహారాష్ట్రలో ముందడుగు
ముంబై నవంబర్ 21  
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై  కీలక ముందడుగు పడింది. శివసేనతో కలిసి నడవడానికి కాంగ్రెస్-ఎన్‌సీపీల మధ్య బుధవారం జరిగిన సమావేశంలో ఓ అభిప్రాయానికి వచ్చాయి. దీంతో వచ్చేవారం మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్-ఎన్‌సీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు మొండుగా ఉన్నాయి. ఇదే సమయంలో అధికారాన్ని శివసేన, ఎన్‌సీపీ రెండున్నరేళ్లు పంచుకుంటాయనే ప్రచారం జరుగుతోంది. దీనికి శివసేన అంగీకరించినట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కనీస ఉమ్మడి ప్రణాళిక అమలు చేసే అంశంపై కాంగ్రెస్-ఎన్‌సీపీ నేతలు చర్చించారు. కాగా, ఈ పరిణామాలపై శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడబోతుందని, ఈ శుభవార్తను త్వరలోనే ఉద్ధవ్‌ ఠాక్రే చెప్పనున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, మేం స్వీట్లు కూడా ఆర్డరిచ్చేశామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌-ఎన్సీపీ గురువారం మరోసారి గురువారం భేటీ అవుతాయని, శుక్రవారం మూడు పార్టీల నేతలు సమావేశం అవుతారన్నారు. శివసేన, కాంగ్రెస్- ఎన్‌సీపీల మధ్య జరుగుతున్న పరిణామాల గురించి ఎలాంటి ప్రచారం జరగుతుందో తనకు తెలియదు, కానీ వీటన్నింటికీ స్వయంగా ఉద్ధవ్‌జీనే ఫుల్‌స్టాప్‌ పెడతారన్నారు. డిసెంబర్‌ 1 లోపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని రౌత్‌ స్పష్టం చేశారు.కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై సమావేశంలో చర్చించామని తెలిపారు. ఎన్సీపీతో చర్చలు కొనసాగుతున్నాయని.. శుక్రవారం కచ్చితమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని వేణుగోపాల్‌ పేర్కొన్నారు.

Related Posts