YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం జ్ఞానమార్గం దేశీయం

 సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదు: గోవర్ధన పీఠాధిపతి

 సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదు: గోవర్ధన పీఠాధిపతి

 సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదు: గోవర్ధన పీఠాధిపతి
తిరుపతి నవంబర్ 21
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై గోవర్ధన పీఠాధిపతి స్వామి నిశ్చలానంద సరస్వతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగా లేదని వ్యాఖ్యానించారు. రామ మందిరానికి స్థలం కేటాయించడం సబబేనని.. కానీ ఇతర మతాల వారికి స్థలం కేటాయించే అధికారం సుప్రీం కోర్టుకు ఎక్కడదన్నారు. ఈ వివాదంలో ఆ స్థలం ఎవరిదో చెప్పాలి కాని.. మరో స్థలం వారికి కేటాయించాలని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మథుర, కాశీ అంశాలపై కూడా ఇలానే తీర్పు ఇచ్చి.. ఆ ప్రాంతాన్ని మిని పాకిస్థాన్‌లా మార్చేస్తారా? అని పేర్కొన్నారు.అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు హయంలోనే 2.7 ఎకరాల స్థలం చెరి సమానంగా పంచాలన్న ప్రతిపాదన వచ్చిందని.. దానికి అందరూ అంగీకరించినా తాను మాత్రం అంగీకరించకపోవడంతో అది మరుగున పడిపోయిందన్నారు.

Related Posts