YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

బ్యాంకుల ద్వారానే పాత నోట్ల మార్పిడి?

బ్యాంకుల ద్వారానే పాత నోట్ల మార్పిడి?

నోట్ల రద్దు ప్రకటించి 15 నెలలు గడిచిపోయాయి! పాత నోట్లను మార్చుకునే గడువు గత ఏడాది జూన్‌లోనే ముగిసింది!! అయినా.. దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల పాత నోట్లు బయటపడుతున్నాయి. కాన్పూర్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.100 కోట్లు ఇందుకు తాజా ఉదాహరణ. ఈ వ్యవహారానికి సూత్రధారి అయిన వ్యక్తికి.. నోట్ల మార్పిడి ఏజెంట్లు గత ఆరు నెలల కాలంలో రూ.15 కోట్ల దాకా మార్చి ఇచ్చినట్టు చెప్పారు! కానీ అదెలా సాధ్యం? ఏ మార్గంలో వాళ్లు పాత నోట్లను ఇంకా మార్చగలుగుతున్నారు? అంటే.. ఒక మార్గంలో మార్చడానికి అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఆడిటింగ్‌ నిపుణుడు తెలిపారు. బ్యాంకుల ద్వారానే పాత నోట్లను ఇప్పటికీ మారుస్తూ ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రద్దయిన నోట్ల మార్పిడికి సహకార బ్యాంకులకు కేంద్రం తొలుత అనుమతి ఇవ్వలేదు. అయినా, ఆ బ్యాంకులు వినియోగదారుల నుంచి పాత నోట్లను తీసుకున్నాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు, ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడితో.. నోట్ల మార్పిడికి సహకార బ్యాంకులకు కూడా ఆర్బీఐ అనుమతించింది. దీంతో.. కొన్ని సహకార బ్యాంకులు తమ వద్ద జమ అయిన మొత్తాల కంటే అధికమొత్తాలను డిపాజిట్లుగా స్వీకరించినట్టు రికార్డుల్లో నమోదు చేసి ఉంటాయి. ఆ మేరకు వాటికి కొత్త నోట్లను ఆర్బీఐ సరఫరా చేయాల్సిఉంటుంది. అదే ఇప్పుడు కొన్ని సహకార బ్యాంకులకు కలిసివస్తోందని అంచనా.

ముస్లిం సహకార బ్యాంక్‌ శాఖల్లో తనిఖీలు.. సీఈవోపై కేసు

రూ.40 లక్షల విలువైన పాత నోట్ల మార్పిడికి సంబంధించిన అక్రమాల కేసులో భాగంగా.. సీబీఐ గురువారం పుణెలోని ముస్లిం సహకార బ్యాంకు పరిపాలన కార్యాలయం సహా 32 చోట్ల తనిఖీలు చేసింది. బ్యాంకు సీఈవో హరూన్‌ సత్తార్‌ సయ్యద్‌, మరో 8 మంది ఉన్నతోద్యోగులపై సీబీఐ భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ కేసులు నమోదు చేసింది. మరోవైపు రూ.50 లక్షల విలువ చేసే రద్దయిన పాతనోట్లను యూపీలోని అలీగఢ్‌లో ఒక హోటల్‌ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related Posts