పాఠశాల మూసివేయాలన్న ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి
ఆర్ కృష్ణయ్య డిమాండ్
హైదరాబాద్ నవంబర్ 21
;రాష్ట్రంలో ఉన్న 26050 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 12వేల పాఠశాలలో మూసివేయాలని ప్రభుత్వ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం దుర్మార్గం. విద్యాహక్కు చట్టం 2009 కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చేసింది. ఈ చట్టాన్ని సవరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు.రాజ్యాంగ ప్రకారం విద్యా, వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఈ బాధ్యత నుంచి తప్పుకొని ప్రైవేటీకరణ వైపు మొగ్గు చూపడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రాకపోవడానికి కారణాలు సరి చేయడానికి ప్రయత్నం చేయడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు రాకపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. 1) మెజారిటీ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం లేకపోవడం, 2) 50 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయకపోవడం. 3) చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపడం లేదు.సర్కారు విద్యను ఎస్సీ/ఎస్టీ/బీసీ/మైనార్టీ కులాలు పల్లెల్లో, గూడెంలో, తండాలలో చదువుకుంటారు. ఈ విద్యను దూరం చేసి పేదలకు విజ్ఞానవంతులు కాకూడదని సర్కారు కుట్ర చేస్తుందన్నారు. తెరాస ప్రభుత్వం విద్యావ్యవస్థను ద్వంసం చేస్తుందని విమర్శించారు. పేద కులాలు చదువుకోకుండా గొర్రెలు – బర్రెలు – పందులు మేపడానికి – చేపలు పట్టడానికి పంపే కుట్ర అన్నారు.పాఠశాలలు మూసివేస్తే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఇక భవిష్యత్తులో ఉండదని, రాష్ట్రంలో 6 లక్షల మంది ఎస్సీ/ ఎస్టీ/బిసి కులాల బీఈడీ - డీఈడీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. వీరందరికీ ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసి పేద కులాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుంది.విద్యా సంస్థలను మూసి వేసి, పరోక్షంగా వచ్చే రోజుల్లో కార్పొరేట్ విద్యా సంస్థలకు, ప్రైవేటు యూనివర్సిటీల అప్పజెప్పాలని ప్రభుత్వం పథకాలు రఛిస్తుంది.రాష్ట్రంలో సర్కార్ పాఠశాల విద్యా వ్యవస్థను, ఉపాధ్యాయుల సంఘలను, ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎలా చేసిన తిరుగుబాటు చేయొద్దని ఒక కొత్త అస్త్రాన్ని వదిలింది. దీని మేధావులు, నిరుద్యోగులు, విద్యార్థులు గళం విప్పాలని, లేకపోతే కార్పొరేట్ శక్తులు తెలంగాణ నుంచి మద్యం దుకాణాల మద్యం లాగా విద్యను అమ్ముతారన్నారు.ఈ కారణాలకు పరిష్కారం చూడకుండా పాఠశాలలు మూసివేస్తే తిరోగమన ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేసారు.