జాతీయ భద్రత కోసం ఎన్ఆర్సీ ఎంతో ఉపయుక్తం: బాబారాందేవ్
న్యూఢిల్లీ నవంబర్ 21
ఎన్ఆర్సీ జాతీయ భద్రత కోసం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ప్రముఖ యోగా గురు బాబారాందేవ్ అన్నారు.భారత దేశమంతా పౌరసత్వ నమోదు (ఎన్‌ఆర్సీ) ప్రక్రియ చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటనను బాబారాందేవ్ స్వాగతించారు. ఎన్ఆర్సీ జాతీయ భద్రత కోసం ఎంతో ప్రయోజనమని, ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని రాందేవ్ కోరారు. మన భారతదేశంలో ఎవరైనా ఒక్క వ్యక్త్తి అయినా అక్రమంగా నివాసముంటే, అది జాతీయ భద్రత, దేశ సమైక్యతకు ఎంతో ప్రమాదకరం...అందుకే మనమంతా మన దేశాన్ని పరిరక్షించుకోవాలి. ఎన్ఆర్సీ జాతీయ భద్రత కోసం ఎంతో ఉపయోగం, ఎన్ఆర్సీ జాబితా తయారు చేయడం సామాజిక, రాజకీయ అంశం కాదని, దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దుఅని బాబారాందేవ్ వ్యాఖ్యానించారు.పౌరుల జాతీయ రిజిస్టరును దేశవ్యాప్తంగా చేపట్టాలని, దీన్ని మతాలకు అతీతంగా చేపట్టాలని బాబా రాందేవ్ సూచించారు.