YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

'టెంపర్' హిందీ రీమేక్ లో హీరోయిన్ ప్రియా వారియర్ కాదు. బాలీవుడ్ హీరో కుమార్తె "సారా అలీఖాన్"

'టెంపర్' హిందీ రీమేక్ లో హీరోయిన్ ప్రియా వారియర్ కాదు. బాలీవుడ్ హీరో కుమార్తె "సారా అలీఖాన్"

టాలీవుడ్‌ లో మంచి హిట్ అయిన 'టెంపర్' సినిమాను బాలీవుడ్ లో రణ్‌ వీర్‌ సింగ్‌ తో రోహిత్ శెట్టి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసింది. కరణ్ జోహర్ నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. సోషల్ మీడియా సంచలనం ప్రియా వారియర్ ఈ సినిమాలో నటించనుందంటూ గతంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ వీటన్నింటినీ రూమర్స్ అని, ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ను ఎంపిక చేసినట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా రోహిత్‌ శెట్టి, కరణ్‌ జోహార్‌ లు ఆమెతో దిగిన ఫోటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. కాగా, సారా అలీఖాన్ ‘కేదార్‌ నాథ్‌’ సినిమాతో బాలీవుడ్‌ అడుగుపెట్టనుంది. సుశాంత్ సింగ్‌ రాజ్‌ పుత్‌ సరసన నటిస్తున్న సారా తొలి సినిమా ఇదైనప్పటికీ ముందుగా విడుదల కానుంది మాత్రం 'సింబా' కావడం విశేషం. 'సింబా' డిసెంబర్‌ లో విడుదల కానుంది.

Related Posts