డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: జగ్గారెడ్డి డిమాండ్
సంగారెడ్డి నవంబర్ 21
: రాష్ట్రంలో డెంగ్యూ, కేన్సర్ ప్రజలను పట్టి పీడిస్తున్నాయని, ప్రస్తుతం డెంగ్యూ ప్రధాన సమస్యగా మారిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.డెంగ్యూను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే ప్రజారోగ్యం కోసం ఉద్యమిస్తామని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.కేన్సర్ బాధితులకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతోందని జగ్గారెడ్డి అన్నారు. చినజీయర్ తన వద్దకు వచ్చే ధనిక భక్తుల చేత ట్రస్ట్ పెట్టించి.. కేన్సర్ బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు చినజీయర్, సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు.